అయిదు పండ్లతో అధిక బరువు..

అయిదు పండ్లతో అధిక బరువు..
బరువు తగ్గడానికి సులభమైన, సహజమైన మార్గాలు అవలంభించడం మంచిది.

బరువు తగ్గడానికి సులభమైన, సహజమైన మార్గాలు అవలంభించడం మంచిది. మితాహారంతో పాటు, వ్యాయామం, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండడం, జీవన శైలిలో మార్పులు ఇవన్నీ బరువు తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక ప్రకృతి ప్రసాదించిన పండ్లను రెడీమేడ్ అల్పాహారం అనుకోవచ్చు. రోజూ ఉదయాన్నే ఇడ్లీ, దోశ, వడ లాంటి బ్రేక్‌ఫాస్ట్ తినకపోయినా ఫండ్లు తింటే సరిపోతుంది.

ఈ పండ్లలో విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. కావునా ఇవి ఆరోగ్యకరమైన ఆహారం మరియు సులభంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. సాధారణంగా కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉండే పండ్లు కొవ్వు తగ్గడానికి సహాయపడతాయి.

వాస్తవానికి రోజూ పండ్లు తీసుకోవడం వలన శరీరం తేలికగా ఉంటుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వాటి బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. బరువు తగ్గడంలో అసాధారణ ఫలితాలను కనబరిచే 5 ఉత్తమ పండ్లు చూద్దాం.

అరటి



తక్కువ కేలరీలు ఉండి ఫైబర్ అధికంగా ఉంటాయి అరటిపండ్లలో. అరటిలో 112 కేలరీలు మాత్రమే ఉన్నాయి. ఇవి మీ బరువును అదుపులో ఉంచుతాయి. ఈ రుచికరమైన పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇది మీకు ఎక్కువ గంటలు కడుపు నిండిన భావన ఇస్తుంది. దాంతో ఆహారం అధికంగా తీసుకునే అలవాటు తగ్గుతుంది.

యాపిల్స్



ఒక ఆపిల్‌లో కేవలం 100 కేలరీలు, దాదాపు 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది, అంటే రోజుకు ఒకటి తినడం వల్ల మీ ఆకలి బాధలు దూరంగా ఉంటాయి. యాపిల్స్ కరిగే ఫైబర్ యొక్క మంచి మూలం. ఈ రకమైన ఫైబర్ బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుంది.

పాషన్ ఫ్రూట్



రుచికరమైన ఆహారం తినడం ద్వారా బరువు తగ్గాలని భావిస్తే పాషన్ ఫ్రూట్ అందుకు మంచి ఉదాహరణ. ఈ పండులో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉన్నాయి. ఈ జ్యూసి పండులో కేవలం 18 కేలరీలు మాత్రమే ఉన్నాయి. ఇది దక్షిణ అమెరికాకు చెందిన పండు. రక్తపోటును మెరుగుపరుస్తుంది, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది, ఇది బరువు తగ్గడానికి చాలా ముఖ్యమైనది.

ద్రాక్షపండు



ద్రాక్షపండులో 65 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం, ద్రాక్షపండు తిన్నవారు లేదా భోజనానికి ముందు ద్రాక్షపండు రసం తాగిన వారు తక్కువ కేలరీలు తింటారు. దీంతో బరువులో 7.1% తగ్గుతారు.

నారింజ



నారింజను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. తియ్యగా, పుల్లగా ఉంటే నారింజ జ్యూస్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఈ సిట్రస్ పండ్లలో 72 కేలరీలు, దాదాపు 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఆరెంజ్ కరిగే ఫైబర్‌ ఉంటుంది. ఇది ఆకలి బాధలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, కరిగే ఫైబర్ శరీరం ఉత్పత్తి చేసే ఆకలి హార్మోన్ల స్థాయిలను అణిచివేసేందుకు సహాయపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story