Grey Hair Control: తెల్లజుట్టు నివారణకు.. ఆహారంలో 6 విటమిన్లు..
Grey Hair Control: ఈ రోజుల్లో జుట్టు త్వరగా నెరసిపోవడం పెద్ద సమస్య. హెయిర్ కలర్, మెహందీ లేదా హెయిర్ డై ఎంత వేసినా అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. జుట్టు త్వరగా నెరిసి పోవడానికి గల కారణాలను తెలుసుకోవడం, వాటిని రూట్ నుండి చికిత్స చేయడం చాలా ముఖ్యం, తద్వారా మీ జుట్టు త్వరగా తెల్లగా మారదు.
నల్లగా నిగనిగలాడుతున్న జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. వయసు మీద పడుతున్నప్పుడు వచ్చే తెల్ల వెంట్రుకలని కూడా సహించలేక ఏవో రంగులు వేసి కవర్ చేస్తుంటారు.
జన్యుపరమైన కారణాల వల్ల తెల్ల జుట్టు సంభవించవచ్చు. స్త్రీలు లేదా పురుషులు, ఎవరికైనా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి. థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు, విటమిన్ బి12 లోపం వల్ల కూడా కొంతమందిలో జుట్టు త్వరగా నెరిసిపోతుంది.
మహిళల్లో ముందుగానే మెనోపాజ్ సంబభవించినప్పుడు, పురుషుల్లో అధికంగా ధూమపానం చేయడం వల్ల కూడా జుట్టు నెరసిపోతుంది. అనారోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి, జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు జుట్టు డ్యామేజ్ అవుతుంది.
ఆరోగ్యమైన జుట్టు కోసం కొన్ని విటమిన్లు తీసుకోవడం ద్వారా వెంట్రుకలు త్వరగా నెరసిపోయే సమస్యను నివారించవచ్చు.
ఆరోగ్యమైన జుట్టుకు అవసరమైన విటమిన్లు
సిట్రస్ పండ్లు - స్ట్రాబెర్రీలు, కివి, పైనాపిల్, పుచ్చకాయ, ఆకుపచ్చని కూరగాయలు వంటివి జుట్టుకు అవసరమైన పోషకాలను, విటమిన్లను అందిస్తాయి.
బంగాళాదుంప, క్యాప్సికమ్, వెజిటబుల్ ఆయిల్, సోయాబీన్, పచ్చి గింజలు, తృణధాన్యాలు, గుడ్డు, బియ్యం, పాలు, చేపలు, చికెన్, రెడ్ మీట్ వంటివి కూడా తీసుకుంటే జుట్టు త్వరగా నెరసిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
విటమిన్ల యొక్క ప్రయోజనాలు
విటమిన్ సప్లిమెంట్లను వేసుకునే బదులు ఆ విటమిన్లు అధికంగా ఉండే సహజ ఆహారాన్ని తినడం ఉత్తమం.
జుట్టు నెరసిపోకుండా నిరోధించే విటమిన్లు
విటమిన్ ఎ సెబమ్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సెబమ్ అనేది సేబాషియస్ గ్రంధులచే ఉత్పత్తి చేయబడిన జిడ్డుగల పదార్థం. ఇది చర్మం కింద ఉంటుంది.
విటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీర కణాలను ఆక్సీకరణం నుండి రక్షిస్తుంది. ఇది జుట్టుకు ఆరోగ్యకరమైన విటమిన్ కూడా.
విటమిన్లు B6, B12 ఆరోగ్యకరమైన చర్మానికి జుట్టుకు సహాయపడే విటమిన్. ఈ విటమిన్ లేకపోవడం వల్ల తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com