Diabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.. నివారణ మార్గాలు..

Diabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.. నివారణ మార్గాలు..
Diabetic Foot Symptoms: రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలను కలిగిస్తాయి.

Diabetic Foot Symptoms: రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలను కలిగిస్తాయి. . అయితే ఇది మీ పాదాలకు కూడా సమస్యలను కలిగిస్తుందని డయాబెటిక్ డాక్టర్లు వివరిస్తున్నారు.

ప్రపంచంలో 415 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో పురుషులు, మహిళలతో పాటు పిల్లలు కూడా ఉన్నారు.

రక్తంలో అధిక చక్కెర స్థాయిలు నరాల వ్యాధికి కూడా దారితీస్తాయి. దీంతో పాదాలు మొద్దుబారతాయి. పాదాల్లో రక్త ప్రవాహం సరిగా జరక ఈ ఇబ్బంది తలెత్తుతుంది. ఈ పరిస్థితిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దీని కారణంగా కాలికి చిన్న గాయం తగిలినా అది తీవ్రంగా మారుతుంది.

డయాబెటిక్-సంబంధిత నరాలవ్యాధి యొక్క సంకేతాలు మరియు లక్షణాలు

కాళ్లు మరియు పాదాలలో నొప్పి, మంట, తిమ్మిర్లు ఉంటాయి.

పాదం లేదా బొటనవేలు కింద ఫుట్ అల్సర్స్ వస్తాయి. నొప్పి లేకపోయినా అశ్రద్ద చేయకుండా వెంటనే డాక్టర్‌కి చూపించాలి.

చర్మం పొడిబారడం, పగుళ్లు, పొలుసులు, పొట్టు వంటి మార్పులు సంభవిస్తాయి.

సకాలంలో చికిత్స చేయకపోతే ఈ కాలిస్ మరియు కార్న్స్ అల్సర్లుగా మారుతాయి.

పై సమస్యల నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి..

మీ చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. మందులను క్రమం తప్పకుండా సమయానికి తీసుకోవడం అవసరం.

స్నానం చేసిన తర్వాత మీ పాదాలను ఆరబెట్టుకోవాలి. అనంతరం క్రీమ్ లేదా జెల్లీని పాదాలకు అప్లై చేయాలి. కాలి వేళ్ల మధ్య ఏమీ రాకుండా జాగ్రత్త వహించండి.

అప్పుడప్పుడు పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచితే మురికి లేకుండా శుభ్రంగా ఉంటాయి. డెడ్ స్కిన్ కూడా ఊడిపోతుంది.

దూమపానం అలవాటు ఉంటే మానేయడం మంచిది.

చెప్పులు లేకుండా నడవడం, బురదలో పని చేయడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

సొంత వైద్యం పనికిరాదు.

గోళ్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. గోరుతో పాటు చర్మం కట్టవకుండా జాగ్రత్త పడాలి.

శుభ్రమైన పొడి సాక్స్ ధరించండి. సాక్స్ కాటన్‌‌వి అయితే సౌకర్యవంతంగా ఉంటుంది. మీ పాదాలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఉంచండి

Tags

Next Story