మధుమేహం.. కళ్లలో కనిపించే 7 ప్రధాన లక్షణాలు

మధుమేహం.. కళ్లలో కనిపించే 7 ప్రధాన లక్షణాలు
భారతదేశంలో మధుమేహం ఆందోళనకరంగా మారింది. కొన్ని లక్షణాలు, సంకేతాలు కళ్లలో కనిపించడం ప్రారంభించి, దీని గురించి మరింత చర్చించుకోవలసిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నాయి.

భారతదేశంలో మధుమేహం ఆందోళనకరంగా మారింది. కొన్ని లక్షణాలు, సంకేతాలు కళ్లలో కనిపించడం ప్రారంభించి, దీని గురించి మరింత చర్చించుకోవలసిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నాయి. డయాబెటిక్ రెటినోపతి గురించి మరియు దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం..

దేశంలో మిలియన్ల మందికి పైగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు కొన్ని నెలల క్రితం లాన్సెట్‌లో ప్రచురితమైన ICMR వెల్లడించింది. డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెరలు పెరిగే వ్యాధి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం ముఖ్యం. అనేక మధుమేహ లక్షణాలే కాకుండా, మీ గ్లూకోజ్ స్థాయి పెరుగుతున్నట్లు మీ కళ్ళు కూడా సూచిస్తాయని చాలా మందికి తెలియదు.

డయాబెటిక్ రెటినోపతి అనేది అధిక రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల రెటీనా ప్రభావితమయ్యే పరిస్థితి. డయాబెటిక్ రెటినోపతి అనేది కంటి వెనుక పొరను కప్పి ఉంచే రెటీనాను ప్రభావితం చేసే ఒక పరిస్థితి. అధిక రక్త చక్కెర స్థాయిలు రెటీనాలోని రక్త నాళాలను దెబ్బతీసినప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ సమస్య డయాబెటిక్ రోగులలో సర్వసాధారణం. సమయానికి గుర్తించకపోతే ఇది కంటి సమస్యలకు దారి తీస్తుంది. దీంతో దృష్టి కోల్పోవడం, అంధత్వం కూడా సంభవిస్తాయి.

ఇది ప్రారంభ దశల్లో గుర్తించదగిన లక్షణాలు లేకుండా అభివృద్ధి చెందుతుంది. అయితే, పరిస్థితి తీవ్రంగా ఉన్నప్సుడు లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అవి ఈ విధంగా ఉంటాయి. అస్పష్టమైన దృష్టి: ఇది ప్రారంభ లక్షణం, ఇందులో దృష్టి మసకబారడం లేదా వస్తువులపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఉండవచ్చు.

ఎరుపు లేదా వాపు కళ్ళు: డయాబెటిక్ రెటినోపతి కళ్ళలో మంటను కలిగిస్తుంది. దీని వలన ఎరుపు మరియు వాపు వస్తుంది.

ఎరుపు మరియు నలుపు రెటీనా: డయాబెటిక్ రెటినోపతి రెటీనాపై ఎరుపు మరియు నల్ల మచ్చలు ఏర్పడవచ్చు, ఇది దృష్టిని ప్రభావితం చేస్తుంది.

తేలియాడే మచ్చలు: కంటిలో తేలియాడే చిన్న మచ్చలు లేదా ముదురు మచ్చలు కనిపిస్తాయి.

మీ దృష్టిలో డార్క్ లేదా బ్లాంక్ స్పాట్స్: డయాబెటిక్ రెటినోపతి తీవ్రతరం కావడంతో, దృశ్య క్షేత్రంలో బ్లైండ్ స్పాట్స్ ఏర్పడవచ్చు.

రంగులు గుర్తించడంలో అస్పష్టత

రాత్రిపూట చూడటం కష్టం: డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారు రాత్రిపూట చూడటం కష్టంగా మారుతుంది.

పై లోపాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. దీంతో నష్టాన్ని నివారించడానికి, దృష్టిని సంరక్షించడానికి సహాయపడుతుంది.

మధుమేహం నియంత్రణలో ఉంచడానికి 5 చిట్కాలు..

షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడం: డయాబెటిస్ విషయంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం షుగర్ పేషెంట్లు వైద్య నిపుణుడి సలహా మేరకు మందులు వాడాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

రెగ్యులర్ వ్యాయామం: రెగ్యులర్ శారీరక శ్రమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. యోగా, నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మంచి ఆహారం: కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నూనె పదార్ధాలు, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

ధూమపానం మానేయండి: ధూమపానం డయాబెటిక్ రెటినోపతితో సహా మధుమేహ సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ధూమపానం మానేయడం అనేది దృష్టిని కాపాడుకోవడంలో ముఖ్యమైన దశ.

రెగ్యులర్ ఐ టెస్ట్ : డయాబెటిక్ రెటినోపతిని ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడానికి కంటి పరీక్షలు కీలకం. ఒక వ్యక్తికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా కనీసం సంవత్సరానికి ఒకసారి లేదా ఏవైనా లక్షణాలు కనిపించినట్లయితే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం.

Tags

Read MoreRead Less
Next Story