7 Chai Recipes: చాయ్‌లో ఎన్ని చమక్కులో.. ప్రతిరోజూ ఉదయం ఓ కప్పు సిప్ చేస్తే..

7 Chai Recipes: చాయ్‌లో ఎన్ని చమక్కులో.. ప్రతిరోజూ ఉదయం ఓ కప్పు సిప్ చేస్తే..
7 Chai Recipes: ఉదయం దుప్పటి ముసుగు తీయగానే ఓ కప్పు వేడి వేడి చాయ్ పడితే కానీ డే స్టార్ట్ అవ్వదు చాలా మందికి.

7 Chai Recipes: ఉదయం దుప్పటి ముసుగు తీయగానే ఓ కప్పు వేడి వేడి చాయ్ పడితే కానీ డే స్టార్ట్ అవ్వదు చాలా మందికి. విటర్ సీజన్‌లో శరీరం వెచ్చగా ఉండేందుకు కూడా చాయ్ సహాయపడుతుంది. మీరు టీ ప్రేమికులైనా కాకపోయినా ఈ వాతావరణం మీ మనస్సుని టీ వైపు మళ్లిస్తుంది. చాయ్ అంటే ఒక్కటే కాదు చాలా రకాలున్నాయి. అందులో ఏదో ఒకటి ప్రయత్నించండి. ఆరోగ్యానికి కూడా మంచిది.. మరింకెందుకు ఆలస్యం రేపటి నుంచే ట్రై చేద్దాం.. మరి వాటి గురించి తెలుసుకుందామా..


1. మసాలా చాయ్: మీరు టీ ప్రేమికులైతే మసాలా చాయ్‌‌ని మరింత ప్రేమిస్తారు.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పుడు పాలు, టీ, అల్లం, యాలకులు, తులసి ఆకులతో కూడిన ఈ రుచికరమైన సమ్మేళనాన్ని సిప్ చేస్తుంటే వావ్ అనాల్సిందే..


2) పసుపు చాయ్: మనకు ఎప్పుడైనా దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వేడి వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని పడుకునే ముందు తాగమని సలహా ఇస్తుంటారు.. అలాగే ఇప్పుడు పసుపు చాయ్ కూడా.. ఇది కొన్ని అద్భుతమైన డిటాక్సింగ్ లక్షణాలను కలిగి ఉన్నందున దీనిని డిటాక్స్ హల్దీ టీ అని కూడా పిలుస్తారు. పసుపు టీ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది ఫ్లూ లేదా ఇతర ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచుతుంది.


3) అల్లం వెల్లుల్లి టీ: అల్లం, వెల్లుల్లిని కూరల్లో వాడడం తెలుసు.. ఇప్పుడు ఈ కాంబినేషన్‌తో టీ కూడా తయారు చేసి తాగొచ్చంటున్నారు.. ఓసారి ప్రయత్నిద్దాం.. నచ్చకపోతే వదిలేద్దాం.. అల్లం, వెల్లుల్లి టీ బరువు తగ్గాలనుకునేవారు తప్పక ప్రయత్నించాల్సిన రెసిపీ.


4) హైదరాబాదీ దమ్ చాయ్: హైదరాబాదీ దమ్ బిర్యానీ గురించి తెలుసుకానీ.. దమ్ చాయ్ ఏంటి కొత్తగా అని అనుకుంటున్నారు కదూ.. కొత్తదనాన్ని కోరుకునే యువత కోసమే ఇలాంటివన్నీ. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందినప్పటికీ, ఈ టీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.


5) అద్రక్ వాలీ చాయ్: ఆరుబయట గడ్డకట్టే చలి.. ఇంట్లో అద్రక్ చాయ్ ఘుమ ఘుమలు. అల్లం రుచితో నిండిన ఈ టీ ఈ సీజన్‌లో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తోడ్పడుతుంది.


6) కశ్మీరీ నూన్ చాయ్: ఈ చాయ్ కశ్మీర్ వాసులకు ప్రత్యేకం.. మరి మనం కూడా కశ్మీరీ చాయ్ రుచిని ఆస్వాదించాలంటే అక్కడి వరకు వెళ్లలేం. కాబట్టి ఇంట్లో కూర్చునేకశ్మీరీ చాయ్‌ని తయారు చేసుకుని అలాంటి అనుభవాన్ని పొందుదాం. ఈ టీ తయారు చేయడానికి కొన్ని గులాబీ రేకులు, కొన్ని మసాలా దినుసులు, తరిగిన బాదం, పిస్తా, బేకింగ్ సోడా అవసరం అవుతాయి.


7) కదా చాయ్: వింటర్ సీజన్‌లో దగ్గు, జలుబు త్వరగా వచ్చేస్తాయి. వీటిని నివారించేందుకు తులసి, నిమ్మ, తేనె, ఏలకులు, నల్ల మిరియాలు, లవంగాలతో సహా వివిధఔషధ గుణాలతో నిండిన అనేక పదార్థాలతో తయారు చేయబడిన హెర్బల్ టీ మాదిరిగా కదా పనిచేస్తుంది.




Tags

Read MoreRead Less
Next Story