Guava Fruit and leaves: జామ పండుతో పాటు ఆకులూ.. ఆరోగ్య ప్రయోజనాలు..

Guava Fruit and leaves: పేదవాడి ఆపిల్‌గా పేరుగాంచిన పండు జామ. రుచిలో అమోఘంగా ఉండి ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండు జామ. సీజన్‌తో పనిలేకుండా సంవత్సరం పొడవునా దొరికే ఈ పండును ప్రతి రోజూ తీసుకున్నా ప్రయోజనమే.
మలబద్దకంతో బాధపడే వారు పండిన జామకాయను తింటే జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దక బాధను తొలగిస్తుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. జామ పండుతో పాటు ఆకులోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
జామ పండ్లలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉన్నాయి. ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
1. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
జామ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జామ ఆకు రసం కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారికి జామ పండు మేలు చేస్తుంది.
2. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
వయసు ప్రభావంతోనో, జీవనశైలి కారణంగానో గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. జామకాయలు గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. జామ ఆకుల్లో అధిక స్థాయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఫ్రీ రాడికల్స్ హృదయాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. జామలో అధిక స్థాయిలో ఉన్న పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది.
జామ ఆకు రసం రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి తోడ్పడుతుంది.
3. రుతుస్రావం యొక్క ఇబ్బందులను తగ్గిస్తుంది.
చాలామంది మహిళలు రుతుస్రావ నొప్పి, తిమ్మిరులు వంటి వాటితో బాధపడుతుంటారు. జామ ఆకు రసం నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. ఆ సమయంలో రెండు స్పూన్త జామ ఆకు రసం తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.
జామకాయలు ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల, జామకాయలను ఎక్కువగా తినడం వల్ల ప్రేగు కదలికలకు సహాయపడి మలబద్దకాన్ని నివారిస్తుంది. జామ ఆకు సారం కూడా మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
5. వెయిట్ లాస్
జామకాయలు బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారం. ఒక పండులో కేవలం 37 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఖనిజాలతో నిండి ఉంటుంది. ఒక కాయ తినడంతో పొట్ట నిండుగా ఉండి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
6. క్యాన్సర్ నిరోధకం
జామ ఆకు సారం యాంటీకాన్సర్ ప్రభావాన్ని చూపుతుంది. జామ సారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటైన ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతినకుండా నిరోధిస్తుంది.
7. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జామలో ఉన్న విటమిన్ సి అంటువ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. ఒక ఆరెంజ్‌లో కంటే రెట్టింపు విటమిన్ సి జామలో ఉంటుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
8. జామకాయలు చర్మానికి మేలు చేస్తాయి
జామపండులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మం త్వరగా ముడుతలు పడకుండా కాపాడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com