పెళ్లికి ముందు తమ కుమార్తెలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన 8 విషయాలు..

పెళ్లికి ముందు తమ కుమార్తెలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన 8 విషయాలు..
పెళ్లంటేనే సర్దుకుపోవడం.. చిన్న చిన్న విషయాలకు చీటికి మాటికి గొడవపడకుండా, విషయాన్ని పెద్దది చేసుకోకుండా, ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే చాలా విషయాలు మూడో వ్యక్తికి తెలియకుండానే పరిష్కారమైపోతాయి.

పెళ్లంటేనే సర్దుకుపోవడం.. చిన్న చిన్న విషయాలకు చీటికి మాటికి గొడవపడకుండా, విషయాన్ని పెద్దది చేసుకోకుండా, ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే చాలా విషయాలు మూడో వ్యక్తికి తెలియకుండానే పరిష్కారమైపోతాయి.

అమ్మా వాళ్లింట్లో అలా ఉండదు.. ఇక్కడేంటి ఇలా ఉంది అని కాకుండా ఎవరి పద్దతులు, ఎవరి అలవాట్లు వారివి అని వాటని అంగీకరించడం మొదలు పెట్టాలి. లేదా స్మూత్ గా తిరస్కరించాలి. అంటే ఎవరినీ నొప్పించకుండా మీ బంధాన్ని కాపాడుకుంటూ మసలు కోవాలి. అప్పుడే మీ వైవాహిక జీవితం ఆనందమయం అవుతుంది.

పెళ్లైన తర్వాత కూడా ఆర్థిక స్వాతంత్ర్యం, గుర్తింపు ఉండడం చాలా ముఖ్యం.

మీ ఆర్థిక అవసరాల కోసం మీ జీవిత భాగస్వామిపై ఆధారపడకుండా ఉండడం మీకు స్వేచ్ఛను ఇస్తుంది. ఇది మీ స్వంత నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని పెంచుతుంది.

ఇతరులు మీ గురించి చెడుగా భావించేలా ప్రవర్తించవద్దు.

మీ స్వంత ఆనందాన్ని ఫణంగా పెట్టి ఇతరుల కోసం మీ ఆనందాన్ని త్యాగం చేయవద్దు.

మానసిక లేదా శారీరక వేధింపులను సహించవద్దు.

మీ కోసం సమయం కేటాయించమనడం స్వార్ధం కాదు. పెళ్లికి ముందే కాదు పెళ్లైన తరువాత కూడా మిమ్మల్ని సంతోష పెట్టే పనులు చేయాలి.

మీకు ఏదైనా సౌకర్యంగా అనిపించకపోతే నో చెప్పడానికి వెనుకాడవద్దు. మీకు నచ్చని వాటిని సహించవద్దు.

పెళ్లి తరువాత కూడా మీ మంచి స్నేహితులను కొనసాగించండి.

మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మానాన్న ఎప్పుడూ అండగా ఉంటారని గుర్తుపెట్టుకోండి.

వివాహం తరువాత ఎదురైన ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వాలి. అప్పుడే వారు సురక్షితంగా తమ వివాహబంధాన్ని కొనసాగించగలుగుతారు.

Tags

Read MoreRead Less
Next Story