Mint Oil: మొటిమల నివారణకు అద్భుత చిట్కా.. పుదీనా ఆయిల్‌తో..

Mint Oil Benefits: తక్కువ రేటు.. ఎక్కువ ఉపయోగాలు.. కూరల్లో కరివేపాకు వేసినట్లే, నాలుగు పుదీనా రెబ్బలు కూడా వేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా. రోజూ పుదీనా ఆకులను వంటల్లోనో మరో రూపంలోనో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పోషకార నిపుణులు. తాజా పుదీనా ఆకులను తీసుకోవడం ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
పుదీనా చర్మానికి కూడా మేలు చేస్తుంది.. మాంసాహార వంటల్లోనే కాదు రోజువారి కూరల్లోనూ పుదీనా వాడడం అలవాటు చేసుకోవాలి. చిన్నకుండీలో వేసుకున్నా పెరుగుతుంది.. ప్రతి రోజు నాలుగు ఆకులు తెంపి కూరల్లో వేసుకుంటే మంచిది. జ్యూస్ రూపంలో మిగిలిన కూరగాయలతో కలిపి తీసుకున్నా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
పుదీనా నిజానికి మన భారతదేశానికి చెందిన మొక్క కాదు.. యూరప్ నుంచి వచ్చిన మొక్క. దీని ఉపయోగాలు తెలిసిన తరువాత సిరప్ రూపంలోనూ, చూయింగ్ గమ్ రూపంలోనూ మార్కెట్లో లభ్యమవుతోంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
జలుబు-దగ్గు- వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు రావడం సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, పుదీనా ఆయిల్‌తో ఆవిరి పడితే ఉపశమనంగా ఉంటుంది.
కడుపునొప్పి- తినకూడని పదార్థాలు లేదా బయటి ఫుడ్ తినడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయి. కడుపులో గడబిడ. అలాంటప్పుడు ఒక స్పూన్ చక్కెర, పుదీనా ఆకుల రసం కలిపి తీసుకుంటే కడుపునొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది.
తలనొప్పి- తలనొప్పికి కారణాలు అనేకం. శరీరం అలసిపోయినా, నిద్ర సరిగాపోకపోయినా, పని వత్తిడి వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పుదీనా ఆకులను మెత్తగా నూరి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది.
పంటి నొప్పి- నేటి కాలంలో దంతాల సమస్య సర్వసాధారణమైపోయింది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఈ నొప్పిని తగ్గించుకునేందుకు పుదీనా బాగా పని చేస్తుంది. గుప్పెడు ఆకులను తీసుకుని బాగా నమిలితే నొప్పి తగ్గుతుంది.
మొటిమలు- పుదీనా ఆయిల్‌ని ముఖానికి రాసుకొవాలి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com