Afghanistan Crisis: ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్ ధరలు..సరుకు కొరతతో ధరలు పెంచారా..?

Dry Fruit Price: కరోనా వైరస్ కారణంగా ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధపెరిగింది. గత ఏడాది కాలంగా ప్రజలు తమ రోగనిరోధకశక్తి పెంపొందేందుకు డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తినడంచేస్తున్నారు. దాంతో డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేస్తున్నారు. డ్రైఫ్రూట్స్ ధరలను బిజినెస్ బాగా సాగింది. అయితే ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో డ్రైఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగాయి. డ్రైఫ్రూట్స్‌లో బాదం, అంజీర, మనక్క, పిస్తా, ఆలూబుకార, ఖుర్బానీ..వంటివి అఫ్గన్ నుంచి దిగుమతి అవుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
తాలిబన్ల గుప్పిట్లో ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోవడంతో మన దేశానికి దిగుమతి అయ్యే డ్రైఫ్రూట్స్ ధరలపై మాత్రం ప్రభావం పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్గానిస్తాన్ నుంచి మనకు పెద్దమొత్తంలో డ్రైఫ్రూట్స్ దిగుమతి అవుతాయి. ముందుగా ఢిల్లీ, ముంబయితో పాటు పలు ప్రాంతాలకు వస్తాయి. అక్కడి నుంచి హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్‌కు దిగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి జిల్లాకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువస్తుంటారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్గన్ - భారత్ మధ్య రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇక్కడ ధరలపై ప్రభావం చూపుతోంది. వారం రోజుల క్రితంతో పోల్చితే కిలో రూ.50 నుంచి రూ.200 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పదిరోజుల్లో బాదంపప్పు కేజీకి రూ.350 పెరగటం అందుకు నిదర్శనం. అలానే పిస్తా, వాల్‌నట్స్, కర్జూరం, అంజీరా ధరలను కొంతమేర పెంచారు. ప్రస్తుతం దేశంలో ఉన్న స్టాక్ పూర్తిగా అయిపోతే మరికొద్ది రోజులకు భారీగా ధరలు పెంచవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం నిజంగా సరుకు కొరతతోనే ధరలు పెంచారా, లేక ఉన్న పరిస్ధితులకు అనుగుణంగా ధరలు పెంచారా అని చర్చించుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com