Kitchen Spices: ఆరోగ్య దినుసులన్నీ.. వంటింటి అల్మారాలోనే.. : అనేక అధ్యయనాలు వెల్లడి

Kitchen Spices: ఆరోగ్య దినుసులన్నీ.. వంటింటి అల్మారాలోనే.. : అనేక అధ్యయనాలు వెల్లడి
Kitchen Spices: జలుబు, దగ్గు, జ్వరం, ఏది వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెట్టకుండా వంటింట్లో ఉన్న మిరియాలు, అల్లం, సొంఠి వంటి వాటిని ప్రయత్నిస్తుంటారు ప్రతి ఒక్కరూ..

Kitchen Spices: జలుబు, దగ్గు, జ్వరం, ఏది వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెట్టకుండా వంటింట్లో ఉన్న మిరియాలు, అల్లం, సొంఠి వంటి వాటిని ప్రయత్నిస్తుంటారు ప్రతి ఒక్కరూ.. అదే కోవిడ్ మరణాల సంఖ్యను తగ్గించిందంటున్నారు పరిశోధకులు.. భారతీయుల పోపుల పెట్టెలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.. అందులోనే ఆరోగ్యం దాగి ఉందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉండడానికి ఇదే కారణమంటున్నారు అధ్యయన నిర్వాహకులు. ముంబైలోని డీవై పాటిల్ ఆయుర్వేదిక్ డీమ్డ్ యూనివర్శిటీ, పూణెలోని భారతీయ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

తమ అధ్యయన వివరాలను జర్నల్ మెడ్ఆర్ఎక్స్ఐవీ జర్నల్ లో తాజాగా ప్రచురించాయి. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుగంధ ద్రవ్యాల వినియోగంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో వాటి వాడకం తక్కువగా ఉన్నందువల్ల అక్కడ కోవిడ్ కేసులు, మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. పరిశోధకులు వివిధ రాష్ట్రాల్లో సుగంధ ద్రవ్యాల వాడకపు లెక్కల్ని పరిశీలించారు..

* జీలకర్ర ఎక్కువగా వినియోగించిన రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

* చింతపండు ఎక్కువగా వాడిన రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు.

* అల్లం కోవిడ్ నివారణకు యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పని చేస్తున్నట్లు గుర్తించారు.

* వెల్లుల్లి, ధనియాలు, పసుపు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క వంటి దినుసులు కూడా భారతీయులకు రక్షణ కల్పించాయి.

* భారత్ లో 52 రకాల సుగంధ ద్రవ్యాలు పండించడంతో పాటు వినియోగిస్తున్నారు.

* దక్షిణాది రాష్ట్రాల్లో చింతపడండు ఎక్కువగా వాడుతుంటారు. అదే ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే అక్కడ దాని వినియోగం తక్కువగా కనిపిస్తుంది.

* లక్షద్వీప్ లో కరివేపాకు, యాలుకలు, లవంగాలు అత్యధికంగా వినియోగిస్తారు. దాంతో అక్కడ కోవిడ్ తీవ్రత తక్కువగా ఉందని అంటున్నారు.

* వైరస్ ను నివారించేందుకు అల్లం, కోలుకునేందుకు వెల్లుల్లి కీలకపాత్ర పోషించాయని అధ్యయనం తెలిపింది.

* రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు అల్లం, పసుపు అద్భుతంగా పని చేశాయని పరిశోధకులు తెలిపారు.

* భారత్ కంటే సుగంధ ద్రవ్యాల వాడకం భారీగా ఉన్న పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కోవిడ్ మరణాలు తక్కువగా కనిపించాయని అధ్యయనం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story