వంటల్లో వెల్లుల్లి.. మొటిమల నివారణలో అద్భుత వల్లి

వంటల్లో వెల్లుల్లి.. మొటిమల నివారణలో అద్భుత వల్లి

ఉల్లి, వెల్లుల్లి వాడందే వంట పూర్తవదు.. కూరకి రుచితో పాటు, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే ఔషధ గుణాలు వెల్లుల్లిలో అధికంగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల వెల్లుల్లిలో 150 కేలరీలు, 33 గ్రాముల పిండి పదార్థాలు, 6.36 గ్రాముల ప్రోటీన్‌ ఉంటాయి. వెల్లుల్లి విటమిన్ బి 1, బి 2, బి 3, బి 6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్‌ సమృద్ధిగా ఉంటాయి.

"వెల్లుల్లిలో అధిక సల్ఫర్ కంటెంట్ యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది విషాన్ని బయటకు తీయడం ద్వారా జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జలుబుకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ధమనులను క్లియర్ చేయడం ద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం పొందడానికి రక్తాన్ని లోపలి నుండి శుద్ధి చేయడం ద్వారా మొటిమలకు మూల కారణాన్ని కనుగొని పరిష్కరిస్తుంది.

మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. వెల్లుల్లి జలుబు, ఫ్లూ వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోజుకు 2-3 వెల్లుల్లి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ వెల్లుల్లి వినియోగం వలన కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. ఇది క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

వెల్లుల్లి ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిన చర్మానికి అద్భుతంగా పని చేస్తుంది. తామర వంటి చర్మ వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తుంది.వెల్లుల్లి నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. అయితే ఉబ్బసం రోగులు వెల్లుల్లిని తినకూడదు. వారిపై ఇది దుష్ప్రభావాలను చూపిస్తుంది. రోజులో 2-3 రెబ్బల కంటే ఎక్కువ వెల్లుల్లి తినకూడదు.

Read MoreRead Less
Next Story