ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించే యాంటీఆక్సిడెంట్లు.. ఎందులో ఎక్కువగా..

యాంటీఆక్సిడెంట్లు మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రలను పోషించే సమ్మేళనాలు. అవి ఎటువంటి కేలరీలను అందించనప్పటికీ, శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
ఒత్తిడిని ఎదుర్కోవడం ద్వారా యాంటీఆక్సిడెంట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడికి లోనైనప్పుడు, ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తిన్నప్పుడు లేదా సిగరెట్లు తాగినప్పుడు శరీరం ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాలక్రమేణా, ఈ ఫ్రీ రాడికల్స్ కణజాలాలకు నష్టం కలిగిస్తాయి. ఇది కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరింప చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్‌ను స్థిరీకరించడం ద్వారా, యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతేకాకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
టాప్ యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్
గింజలు, బీన్స్ వంటి ఆహారాలు తీసుకుంటే మీరు ఇప్పటికే యాంటీఆక్సిడెంట్లను వినియోగిస్తున్నట్లు భావించవచ్చు. యాంటీఆక్సిడెంట్లు అనేక రకాల ఆహారాలలో కనిపిస్తాయి, కొన్ని యాంటీఆక్సిడెంట్ ఉత్పత్తులు ఇతర వాటికంటే భిన్నమైన పాత్రను పోషిస్తాయి. ఉదాహరణకు, బ్లూబెర్రీస్ లో ఉండే ఆంథోసైనిన్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. గుడ్డు సొన, బచ్చలికూర, పిస్తాలో ఉండే లుటిన్ అనే యాంటీఆక్సిడెంట్ మెదడు చురుకుగా పని చేయడానికి, కంటి ఆరోగ్యం మెరుగు పడడానికి తోడ్పడుతుంది.
ఎర్రటి కిడ్నీ బీన్స్ అనేక పండ్లు, కూరగాయల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. కనుక తప్పనిసరిగా యాంటీ ఆక్సిడెంట్ కు సంబంధించిన ఏదో ఒక ఉత్పత్తిని ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com