Skincare Tips: ఖరీదు చేసే కాస్మొటిక్స్ ఎందుకు.. ఇంటి చిట్కాలతో అందంగా..

Skincare Tips:  ఖరీదు చేసే కాస్మొటిక్స్ ఎందుకు.. ఇంటి చిట్కాలతో అందంగా..
Skincare Tips: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుంటే అందంగానూ ఉంటారు. మీ ముఖం మెరిసిపోవడానికి అంతర్గతంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.

Skin Care tips: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుంటే అందంగానూ ఉంటారు. మీ ముఖం మెరిసిపోవడానికి అంతర్గతంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. డిటాక్స్ డ్రింక్ తీసుకుంటే మీ శరీరంలోని వ్యర్ధాలన్నీ బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం ఉదయాన్నే పరగడుపున నిమ్మకాయ, తేనె, దాల్చినచెక్క, మిరియాలు కలిపిన గోరువెచ్చని నీటిని తాగాలి.

తేనె, పాలు/పెరుగు వంటి వాటితో వారానికి ఒకసారైనా ఫేస్ ప్యాక్‌ వేసుకోవాలి. కొన్ని నిమిషాలు అప్లై చేసి, ఆపై మీ ముఖాన్ని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.

"ప్రతి భోజనంలో వెజిటబుల్ సలాడ్ ఉండేలా చూసుకోవాలి. పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. రోజంతా నీరు త్రాగుతుండాలి. 20 కేజీలకు ఒక లీటర్ చొప్పున మీ బాడీ వెయిట్ ఎన్ని కేజీలు ఉంటే అన్ని లీటర్ల నీరు తాగడానికి ప్రయత్నించాలి. మంచి జీవితానికి ధ్యానం చాలా కీలకం. ఇది మిమ్మల్ని రోజంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. ధ్యానం మనం చేస్తున్న పనిపై మరింత దృష్టి పెట్టేందుకు సహకరిస్తుంది.

మన ముఖానికి నిత్యం ఎన్నో సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటాం. కొన్నిసార్లు ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టడానికి, కొన్నిసార్లు మొటిమలను వదిలించుకోవడానికి వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తారు.

సీరమ్ చర్మానికి ముఖ్యమైన సౌందర్య సాధనం. ఇది ముఖం యొక్క గ్లోను పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మార్కెట్‌లో చాలా రకాల సీరమ్‌లు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిలోని రసాయనాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. అలా కాకుండా ఇంట్లోనే సీరమ్‌ను సిద్ధం చేసుకోవడం మరింత ప్రయోజనకరం.

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్ ఇ, సి అవసరం. ఈ మూలకాలను మనం ఆహారం నుండి పొందుతాము. అయితే ఈ పదార్థాలను పై నుంచి చర్మానికి ఇచ్చినా ప్రయోజనం ఉంటుంది. ఇది చర్మం మరింత కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మం మెరుస్తూ ఉండాలంటే ఇంట్లోనే సీరమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం? విటమిన్ ఇ చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

కావలసినవి..

1. 3 నుండి 4 విటమిన్ ఇ క్యాప్సూల్స్

2. అలోవెరా జెల్ 2 టీస్పూన్లు

3. రోజ్ వాటర్ 2 టీస్పూన్లు

తయారుచేయు విధానం..

1. ఒక గిన్నెలో విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కట్ చేసి వేయండి.

2. దానికి రోజ్ వాటర్ మరియు అలోవెరా జెల్ కలపండి.

3. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.

4. ఇప్పుడు దీనిని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి.

5. తరువాత ముఖాన్ని కడగాలి.

6. విటమిన్ ఇతో పాటు, సీరమ్‌కు విటమిన్ సి క్యాప్సూల్స్‌ను కూడా జోడించవచ్చు. దాంతో చర్మం మరింత కాంతివంతంగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story