silky hair: ఆయుర్వేద చిట్కాలతో జుట్టు సిల్కీగా..

silky hair: ఎండాకాలంలో వచ్చే అత్యంత సాధారణ జుట్టు సమస్యలలో పొడి, చిట్లిన జుట్టు ఒకటి . అయితే, మీరు వాటిని ఎదుర్కోవటానికి ఖరీదైన ఉత్పత్తులు వాడడం అవసరం లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మీ జుట్టు సంరక్షణకు ఆయుర్వేదిక్ డాక్టర్ ఖత్రీ కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.
పొడిగా ఉన్న, చిట్లిన జుట్టును కేవలం రెండు పదార్థాలతో "సిల్కీగా, మెరిసేలా" మార్చవచ్చంటున్నారు. ఆ పదార్ధాలే ఉసిరి పొడి, ఆముదం.
దీన్ని ఎలా తయారు చేయాలి?
కావలసినవి
ఉసిరి పొడి
నీరు
ఆముదం
పద్ధతి
ఉసిరి పొడి, నీళ్లను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి, మీ జుట్టు పొడవును బట్టి 10 మి.లీ ఆముదం కలపండి .
అప్లై చేసే విధానం..
ఆ పేస్ట్‌ని జుట్టు అంతా పట్టించాలి. తల అంతా పట్టించాక 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. దాని తర్వాత సాధారణ నీటితో కడగాలి.
మరుసటి రోజు షాంపూతో కడగాలి. ఈ పేస్ట్ మీ జుట్టుని సిల్కీగా ఉంచుతుంది.
తల, శరీరం దురదలు పెడుతుంటే.. వేప ఆకులను వేడినీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి.
ప్రతిరోజూ 4-5 లేత వేప ఆకులను నమిలితే పొట్ట కూడా శుభ్రపడుతుంది. .
వేసవి కాలంలో సిట్రస్ అధికంగా ఉన్న పుల్లని పదార్థాలను నివారించాలి. ఉప్పు కూడా తక్కువగా తీసుకోవాలని డాక్టర్ ఖత్రి సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com