Thyroid: ఆయుర్వేద చిట్కాలతో థైరాయిడ్ కు చెక్..
Thyroid: జీవనశైలి కారణంగానే చాలా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. థైరాయిడ్ కూడా అందులో ఒకటి. థైరాయిడ్ ఒక వ్యాధి కాదు జీవనశైలి రుగ్మత. ఈ రుగ్మత రెండు రకాలు. థైరాయిడ్ గ్రంధి హార్మోన్ ఉత్పత్తి మందగించడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు కూడా మందగిస్తాయి. హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తి బరువు పెరుగుతాడు. రెండోది హైపర్ థైరాయిడిజం. ఇది థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. హైపర్ థైరాయిడిజం ఉంటే, ఆ వ్యక్తి బరువు తగ్గుతాడు.
డాక్టర్ ముఖేష్ శర్మ మాట్లాడుతూ, ఆయుర్వేదం ప్రకారం, థైరాయిడ్ శరీరంలో వాత, కఫ దోషాల పెరుగుదల కారణంగా సంభవిస్తుంది. ఈ రెండు దోషాలు మానవ శరీరంలోని శారీరక, మానసిక ప్రక్రియలను నియంత్రించే జీవ శక్తులు. శరీరంలో ఈ దోషాల అసమతుల్యత థైరాయిడ్‌కు దారితీస్తుంది.
శరీర జీవక్రియలను సమతుల్యం చేయడం. థైరాక్సిన్ హార్మోన్ ప్రసరణను సరిచేయడం ద్వారా థైరాయిడ్‌ను నియంత్రిం,చవచ్చని ఆయుర్వేదం విశ్వసిస్తుందని ఆయన తెలిపారు. ఇది థైరాయిడ్ రోగులకు థైరాయిడ్‌ను నియంత్రించడానికి ఇంట్లోనే సాధన చేయగల కొన్ని సులభమైన నివారణలను అందిస్తుంది.
శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ ప్రసరణను మెరుగుపరచడానికి ఆయుర్వేదం అందించే కొన్ని ఈజీ చిట్కాలు./ ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో వాత దోషం పెరగడం వల్ల థైరాయిడ్ అసమతుల్యత ఏర్పడుతుంది. మీరు థైరాయిడ్ పేషెంట్ అయితే, మీ శరీరంలో వాతాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోకూడదు. అరటిపండ్లు, బచ్చలికూర, బీన్స్, చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
కఫాన్ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. థైరాయిడ్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి బరువు పెరగడం. ఈ బరువు పెరుగుట మరియు థైరాయిడ్‌ను నియంత్రించడానికి, కఫాన్ని శాంతింపజేసే ఆహారం తీసుకోవాలని చెబుతారు ఆయుర్వేద వైద్యులు. తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, బీన్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. రోజుకు కనీసం ఒక పండు తినడానికి ప్రయత్నించాలి.
ప్రాణాయామం సాధన చేయండి
ప్రాణాయామం అనేది శ్వాసను నియంత్రించే యోగాభ్యాసం. థైరాయిడ్ రోగులు ప్రాణాయామం సాధన చేయాలని సూచిస్తారు ఆయుర్వేద వైద్యులు. ఇది శరీరంలోని వాతాన్ని సమతుల్యం చేస్తుంది. తద్వారా థైరాయిడ్ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మార్నింగ్ వాక్ కోసం వెళ్ళండి
హార్మోన్ల అసమతులత్యను నివారించడానికి మార్నింగ్ వాక్ చేయడం తప్పనిసరి అలవాటుగా చేసుకోవాలి.
మసాజ్
నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీరం నుండి అదనపు కొవ్వును తగ్గించడంలో మసాజ్ సహాయపడుతుంది.
కొన్ని వంటింటి చిట్కాలు
ఆయుర్వేద పద్ధతులు సాధారణంగా సహజ నివారణలను ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ సహజ నివారణలు సాధారణంగా వంటగదిలో అందుబాటులో ఉంటాయి. థైరాయిడ్ స్థాయిలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, కొంచెం త్రిఫల, మెంతి, అల్లం లేదా కలబందను తీసుకోండి. ఈ పదార్థాలు థైరాయిడ్ రోగులకు నిజంగా ఓ వరం అని చెబుతారు ఆయుర్వేద వైద్యులు.
థైరాయిడ్ పేషెంట్ కాఫీ, టీలకు బదులు హెర్బల్ టీ తీసుకోవడం ఉత్తమం.
గమనిక: పై సూచనలు, సలహాలు ఇంటర్నెట్లో ఆయుర్వేద నిపుణులు అందించిన సమాచారం మేరకు వివరించడం జరిగింది. మీ మీ పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా ప్రకారం నడుచుకోవాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com