Banana Peel: తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఉపయోగాలు తెలిస్తే..

Banana Peel: తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా.. ఉపయోగాలు తెలిస్తే..
Banana Peel: అరటిపండు ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

Banana Peel : అరటిపండు ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. ఐరన్ లోపం ఉంటే అరటిపండు తినడం మంచిది. చక్కెర వ్యాధి ఉన్నవారు మినహా అందరూ అరటిపండుని తినొచ్చు. పండులోని అమైనో ఆమ్లాలు, విటమిన్లు చర్మాన్ని మృదువుగా ఉంచాతాయి. జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.

పండుతోనే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయనుకుంటే అరటి తొక్కలో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అరటిపండు తిని తొక్కను పడేస్తాము. అయితే, అరటిపండు తొక్కతో చాలా ఉపయోగాలున్నాయంటున్నారు నిపుణులు.. వాటిని గురించి తెలుసుకుందాం.

చర్మ సంరక్షణ

జుట్టు ఆరోగ్యం

పళ్ళు తెల్లబడటం

ప్రథమ చికిత్స

గృహాన్ని శుభ్రపరిచేందుకు

పెరటి మొక్కలు బాగా పెరిగేందుకు

చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి.

అరటిపండు తొక్కను ముఖంపై రుద్దడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, ముడతలు తగ్గుతాయి. మొటిమల మచ్చలపై తొక్కను రుద్దడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. మొటిమలు ఉన్న ప్రదేశంలో రాత్రంతా అక్కడ తొక్కను ఉంచడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి. తేమ, దురద నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. సోరియాసిస్ చికిత్సకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.

అరటిపండు తొక్కలో ఫినోలిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇంకా వీటిలో కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. మరికొన్ని అధ్యయనాలు అరటిపండు తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు.

జుట్టు ఆరోగ్యానికి అరటి తొక్కలు

ఆరోగ్యం, సౌందర్య సాధనాల కోసం సహజ ఉత్పత్తుల యొక్క ప్రతిపాదకులు అరటి తొక్కను హెయిర్ మాస్క్‌లో ఒక పదార్ధంగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇది మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుందని వారు అంటున్నారు.

జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.

దంతాలు తెల్లబడటానికి అరటి తొక్కలు

అరటి తొక్కను దంతాల రుద్దడం వలన దంతాలకు మరియు చిగుళ్లకు మంచిదని మరికొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఒక వారం రోజుల పాటు ప్రతిరోజూ అరటి తొక్కతో పళ్లు రుద్దుకుంటే దంతాలు తెల్లబడతాయని కూడా వారు సూచిస్తున్నారు.

మీ నుదిటిపై అరటిపండు తొక్కను ఉంచితే తలనొప్పి నొప్పి తగ్గుతుంది.

లెదర్ బూట్లు, వెండి వస్తువులను అరటి తొక్కలతో రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి. మొక్కలకు ఎరువుగానూ అరటి తొక్కలు ఉపయోగపడతాయి. వాడేసిన అరటి తొక్కలను నీటిలో వేసి నానబెట్టాలి. ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇది మొక్కలకు బలంగా పెరగడానికి దోహదపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story