Beauty Tips: కలబందతో అందం; ఈజీగా ఇంట్లోనే ఫేషియల్ జెల్‌

Beauty Tips: కలబందతో అందం; ఈజీగా ఇంట్లోనే ఫేషియల్ జెల్‌
మొటిమలు, మచ్చలు పోయే అద్భుతమైన జెల్‌; ఇంట్లోనే సులభంగా తయారు; కల‌బంద గుజ్జుతో ముఖ సౌంద‌ర్యం

కలబందతో బ్యూటీ టిప్స్.. ఈజీగా ఇంట్లోనే ఫేషియల్ జెల్‌


క‌ల‌బంద మొక్క‌లు ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి. పెర‌ట్లో ఉన్న ఈ మొక్కతో ఎన్నో అద్భుత లాభాలు ఉన్నాయి. ఔషత గుణాలున్న ఈ మొక్కతో ఇటు ఆరోగ్యం, అటు సౌందర్యం రెండూ చేకూరుతాయి. క‌ల‌బంద గుజ్జును ఉపయోగించి ముఖ సౌంద‌ర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. క‌ల‌బంద గుజ్జును కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. తర్వాత 30 నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేసినట్లైయితే, ముఖం కాంతివంతంగా మారడంతో పాటు, ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోవడంతోపాటు చ‌ర్మం మృదువుగా తయారవుతుంది.

2. ఇక 1 టీస్పూన్ క‌ల‌బంద గుజ్జుతో పాటు, అంతే మోతాదుతో ఆలివ్ నూనె క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని క‌నుబొమ్మ‌ల‌పై రాయాలి. రాత్రి నిద్రించే ముందు ఇలా చేసి, మ‌రుస‌టి రోజు ఉద‌యం క‌డిగేయాలి. దీంతో క‌నుబొమ్మ‌లు అందంగా క‌నిపించ‌డ‌మే కాకుండా ఒత్తుగా పెరుగుతాయి.

3. క‌ల‌బంద గుజ్జు 1 టీస్పూన్ తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాట‌ర్ క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని శ‌రీరంపై రాసి, కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి. దీని వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు పోవడంతోపాటు, చ‌ర్మం మెరుస్తుంది.

4. అంతేకాకుండా పార్లర్‌ కు వెళ్ళకుండా ఫేస్‌ క్లెన్సింగ్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఫేషియల్ ఎల్లప్పుడూ క్లెన్సింగ్‌తో మొదలవుతుంది. కలబంద జెల్ సహజమైన క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ముఖంపైన మురికిని, జిడ్డును శుభ్రం చేస్తుంది.

ఇందుకోసం ఒక గిన్నెలో అలోవెరా జెల్‌ను తీసి, దానిలో చిటికెడు పసుపు వేసి రెండింటినీ బాగా మిక్స్ చేయ్యాలి. అనంతరం ఈ పాక్‌ ను మీ ముఖం, మెడపై అప్లై చేయ్యాలి. ఒక నిమిషం పాటు వృత్తాకార కదలికలో మసాజ్ చేసి, ఆపై తడి టిష్యూ పేపర్ తో ముఖాన్ని శుభ్రం చేయండి. ఇలా నెలకు రెండు సార్లు చేసినట్లైయితే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story