పుచ్చకాయతో ముఖసౌందర్యం మరింత రెట్టింపు..!

పుచ్చకాయతో ముఖసౌందర్యం మరింత రెట్టింపు..!
వాటర్ మిలాన్ కూడా ఆరోగ్యంతో పాటుగా ముఖానికి మంచిదంటున్నారు నిపుణులు. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం కలిపి ముఖానికి రాసుకుంటుంటే మొఖం కాంతివంతమవుతుంది.

వేసవికాలంలో ఎండల నుంచి మొఖాన్ని కాపాడుకునేందుకు చాలా మంది చాలా పద్దతులను పాటిస్తుంటారు. అందులో భాగంగానే వాటర్ మిలాన్ కూడా ఆరోగ్యంతో పాటుగా ముఖానికి మంచిదంటున్నారు నిపుణులు. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం కలిపి ముఖానికి రాసుకుంటుంటే మొఖం కాంతివంతమవుతుంది. ఇక ఎండలో తిరిగి వచ్చినప్పుడు పుచ్చకాయ రసం-తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకుంటే మంచి టోనర్ గా పనిచేస్తుంది. చర్మంపై చేరిన మురికిని పోగొడుతుంది. అంతేకాకుండా చర్మంపై ముడతలు, మచ్చలుంటే పుచ్చకాయ రసంలో నిమ్మరసం కలిపి రాత్రి ముఖానికి రాసుకుని పడుకోవాలి. పొద్దున్న లేచిన వెంటనే చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మొఖం ఎంతో తాజాగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story