ఫ్రిజ్‌లో కంటే... కుండలోని వాటర్ తాగడమే బెస్ట్.. ఎన్ని లాభాలో తెలుసా?

ఫ్రిజ్‌లో కంటే... కుండలోని వాటర్ తాగడమే బెస్ట్.. ఎన్ని లాభాలో తెలుసా?
X
ఎండాకాలం ఇంకా రాలేదు కాదు.. కానీ ఎండలు మాత్రం భీభత్సంగా కొడుతున్నాయి. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇంకా మేలో ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేసుకోవచ్చు..

ఎండాకాలం ఇంకా రాలేదు కాదు.. కానీ ఎండలు మాత్రం భీభత్సంగా కొడుతున్నాయి. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇంకా మేలో ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేసుకోవచ్చు.. అయితే ఎండాకాలం అంటే అందరికీ ఎక్కువగా చల్లని వాటర్ గుర్తుకువస్తుంది. ఒక్కసారి బయటకి వెళ్లి వస్తే చాలు.. ఎన్నీ బాటిళ్ళ వాటర్ అయిన గడగడ తాగేస్తాము.. అయితే ఈ సమయంలో ఫ్రిజ్‌లోని వాటర్ కంటే... కుండలోని వాటర్ తాగడమే బెస్ట్ అని అంటున్నారు నిపుణులు.. కుండలోని వాటర్ తాగడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.

కుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్‌ చేసిన నీటితో సమానం..

♦ కుండలో నీళ్ళు వేపరైజేషన్ పద్ధతిలో నీటిని సహజంగా చల్లగా చేస్తుంది.. కుండకి ఉన్న చిన్న చిన్న రంధ్రాల వల్ల అందులోని నీటికి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి.

♦ అతి దాహం, ఒళ్ళు పేలడం వంటివి రావు. ఎందుకంటే, అందులో నీళ్ళు చల్లగా ఉండడమే కాదు, అవి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తాయి.

♦ పీహెచ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తుంది. కుండలోని నీళ్ళు తాగడం వలన ఎసిడిటీ లాంటి గాస్ట్రిక్ ప్రాబ్లంస్ రాకుండా ఉంటాయి.

♦ కుండలోని నీళ్ళు తాగడం వలన దగ్గూ, జలుబూ రావు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ , గొంతు నొప్పి ఉండదు.

♦ మంటి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహాజ మినిరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి.

♦ వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది.

రెగ్యులర్‌గా కుండలో నీళ్ళు తాగడం వల్ల మరెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు.

Tags

Next Story