ఇరుకు అపార్ట్మెంట్లలో విశాలంగా ఉండేందుకు బెస్ట్ లివింగ్ రూమ్ ఐడియాలు

ఇరుకు అపార్ట్మెంట్లలో విశాలంగా ఉండేందుకు బెస్ట్ లివింగ్ రూమ్ ఐడియాలు
చిన్న అపార్ట్ మెంట్లలో స్పేస్ ను క్రియేట్ చేసేందుకు బెస్ట్ ఐడియాస్

ఇల్లును మెయింటైన్ చేయడమే కాదు.. దాన్ని అందంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం కూడా చాలా ముఖ్యం. చక్కని డిజైనింగ్, కలరింగ్ ఇంటికి అందాన్ని తెచ్చిపెట్టడమే కాదు.. ఇంట్లో ఉండే వారి మనసూ ప్రశాంతంగా ఉండేందుకు కారణమవుతుంది. అందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. తమ సృజనాత్మకతతో, మీ చిన్న నివాస స్థలాన్ని సౌకర్యవంతంగా మలచుకోవచ్చు. అందులో ఫర్నిచర్ ఎంపిక చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా లివింగ్ రూమ్ ను స్టైలిష్ హెవెన్‌గా మార్చడం చాలా ముఖ్యం.

లివింగ్ రూమ్ లో కొందరు ఫర్నిచర్ కూడా గోడలకు అంటిపెట్టేలా ఏర్పాటు చేస్తారు. కానీ దానికి బదులుగా వీలైనంత వరకు లివింగ్ రూమ్ లో తక్కువ ఫర్నిచర్ ఉండేలా చూసుకోండి. గోడ మూలల్లో మొక్కలను పెడితే మరింత ఆకర్షినీయంగా ఉంటుంది. అలా సృజనాత్మక పరిష్కారాలతో, సరైన ఫర్నిచర్ ను ఎంచుకోవడం, అందుబాటులో ఉన్న స్థలాన్ని ఉత్తమంగా ఉపయోగించుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని, శైలిని ప్రతిబింబించేలా అమరిక చేసుకోవడం చాలా ఉత్తమం.

చిన్న స్థలాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆహ్వానించదగినదిగా, మల్టీఫంక్షనల్‌గా, సౌందర్యపరంగా ఆహ్లాదకరంగా మార్చడానికి కొన్ని కీలకమైన డిజైన్ చిట్కాలు, ట్రిక్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నివాస స్థలం ఎంత చిన్నదైనప్పటికీ అక్కడ చేసే డిజైనింగ్, కలరింగ్ మన మూడ్ పైనా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గదులకు తెలుపు, లేత గోధుమరంగు, క్రీమ్, పసుపు.. ఇలాంటి షేడ్స్‌ని ఎంచుకోండి.

గోడలను సాదాగా ఉంచకుండా.. వాటిపై డిజైన్ తో అలంకరించండి. జిగ్-జాగ్స్. నిలువు స్ట్రిప్స్ లాంటివి గోడను హైలెట్ చేయడంలో సహాయపడతాయి. ఇంట్లో వీలైనంతం ఖాళీ స్థలాన్ని ఉంచడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ఫ్లోర్ లైట్లకు బదులుగా గోడ దీపాలు, స్కాన్‌లను ఉపయోగించండి. మీరు మొక్కలను ఇష్టపడితే, వాల్ స్టాండ్‌లు, చిన్న కుండీలను ఓ మూలన పెట్టుకోవచ్చు. కిటీకీలకు పొడవాటి డోర్ కర్టెన్లను ఎంచుకోండి. పాలిస్టర్, సిల్క్ లేదా కాటన్ తో చేసిన పొడవాటి తెరలు ఇంటిని మరింత అందంగా ఉంచేందుకు సహాయపడతాయి. మామూలుగా ఎవరైనా ఇంట్లోకి రాగానే చూసేది లివింగ రూమ్. కాబట్టి ఈ గోడలపై పెయింటింగ్‌లు, ఫ్యామిలీ ఫొటోలు ఉంచడం వల్ల ఇంట్లోకి రాగానే ఓ పాజిటివ్ వైబ్ ను తీసుకువస్తుంది.

ఇంటిని సరిగ్గా సర్దుకోవడమే కాదు ఇంట్లో వాడే లైటింగ్ కూడా చాలా ముఖ్యం. గదులను అలంకరించే ముందు సరైన లైటింగ్ ను ఎంచుకోవాలి. అందుకోసం ఫ్లోర్ ల్యాంప్స్, రీసెస్డ్ లైటింగ్స్, సీలింగ్ ఫిక్చర్‌లు, స్పాట్‌లైట్ల వంటి వాటిని చూస్ చేసుకోవచ్చు.

ఇక లివింగ్ రూంలో ఫర్నిచర్ విషయానికొస్తే.. వీటిని ఎంచుకునేటప్పుడు తెలివిగా ప్రదర్శించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఆ తర్వాత వాటి వల్ల ఎలాంటి అసౌకర్యానికీ గురి కాకూడదు. ఉదాహరణకు, పొడవాటి ఆకారం ఉన్న సోఫాను ఎంచుకుని, పక్కనే రెండు చిన్న సోఫా కుర్చీలను ఉపయోగించండి. అదేవిధంగా, మీరు మీ కాఫీ టేబుల్‌గా ఒట్టోమన్‌ను ఉపయోగించవచ్చు. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినపుడు.. మీరు దానిపై స్నాక్స్‌ని ఉంచవచ్చు. వారు వెళ్లిపోయినప్పుడు మళ్లీ దాన్ని పక్కకు నెట్టి పూల కుండీని పెట్టుకోవచ్చు.


చిన్న అపార్ట్‌మెంట్ లో లివింగ్ రూమ్‌ను స్టైల్ గా చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి వెనుక గోడపై మధ్యభాగంలో ఏదైనా కళాకృతిని ఉంచడం. ఆర్ట్ వర్క్ లేదా ఏదైనా అలంకార ప్రాయంగా తోచే వస్తువులను కూడా ఇక్కడ అమర్చవచ్చు. దీని వల్ల రూమ్ మరింత అందంగా కనిపిస్తుంది.

అపార్ట్మెంట్ లో గదిని అలంకరించేటప్పుడు రంగు థీమ్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. మీ లివింగ్ రూమ్ కోసం కలర్ థీమ్‌ను ఎంచుకునేటప్పుడు, అది గది ఫ్లోర్, ఫర్నీచర్‌కు మ్యాచింగ్ ఉండేలా చూసుకోవాలి. కలర్ థీమ్ అనేది హాయిగా కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కారణంగా నిలుస్తాయి. కొన్ని రంగులు గది ఉన్న దానికంటే పెద్దదిగా కనిపించేలా చేస్తాయి, అలాగే, లేత రంగులు స్థలం భ్రమను సృష్టిస్తే, ముదురు రంగులు గదిని చిన్నగా చూపిస్తాయని గుర్తుంచుకోండి.

లివింగ్ రూమ్ లో క్లోజ్డ్ అల్మారాలకు బదులుగా ఓపెన్ అల్మారాలు ఉపయోగించడం చాలా మంచిది. అయితే ఓపెన్ షెల్ఫ్‌ల వల్ల ధూళి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అవి మీ వస్తువులను ప్రదర్శించడానికి సహాయపడతాయి, ఓపెన్ అల్మారాలు స్థలం భ్రమను కూడా ఇస్తాయి ఎందుకంటే మీరు వాటి ద్వారా నేల, గోడలను సులభంగా చూడవచ్చు. కాబట్టి వాల్ మౌంట్ నుండి స్టాండింగ్ షెల్ఫ్‌ల వరకు - మీ లివింగ్ రూమ్ డిజైన్‌కు బాగా సరిపోయే వాటిని ఎంచుకోండి! మీరు మీ లివింగ్ రూమ్ కోసం ఓపెన్ షెల్ఫ్‌లు. క్లోజ్డ్ క్యాబినెట్‌ల కలయికను కూడా ఎంచుకోవచ్చు కానీ మూసి ఉన్నవి ఓపెన్ వాటి కంటే తక్కువ అందంగా చూపిస్తాయని మర్చిపోకండి.

మీ కిటికీలు లేదా తలుపులకు ఎదురుగా లేదా ప్రక్కనే అద్దాన్ని వేలాడదీయడం ద్వారా మీ ఇంటిలోని సహజ కాంతిని మరింత ప్రతిబింబించేలా చేస్తుంది. ఇది మీ చిన్న అపార్ట్‌మెంట్ లివింగ్ రూమ్ ప్రకాశవంతంగా. పెద్దదిగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా, ఈ ప్రదేశాలలో అద్దాన్ని ఉంచడం వలన మీ గదిని మరింత సౌందర్యంగా ఆహ్లాదకరంగా మార్చడమే కాకుండా ఏదైనా అవాంఛనీయ ప్రతికూలత లేదా చెడు శక్తిని దూరం చేస్తుంది.

Next Story