Betel Leaves: చిన్నారుల జలుబును దూరం చేసే తమలపాకులు.. ఎలా వాడాలంటే..

Betel Leaves: బుజ్జి బుజ్జి పాపాయిలు.. అడుగులు తడబడుతూ నడిచే చిన్నారులు.. వర్షాకాలం, శీతాకాలం వేధించే సీజనల్ వ్యాధులు.. వెచ్చగా ఉంటుందని దుప్పటి కప్పినా ఉంచుకోరు.. స్వెటర్ వేస్తే చిరాకుపడుతుంటారు. ముక్కు కారుతూ, ఆయాస పడుతూ, దగ్గుతూ మరి కొందరు చిన్నారులకు శీతాకాలం నరకప్రాయం. దీంతో ఊపిరి పీల్చుకోవడం, నిద్రించడం కూడా కష్టంగా ఉంటుంది. అమ్మకి ఏం చెయ్యాలో పాలుపోదు.. బిడ్డ కష్టాలను చూస్తూ బాధపడుతుంది.
అలాగే, చాలా మంది తల్లులు తమ పిల్లలకు దగ్గు, జలుబు వంటి తేలికపాటి అనారోగ్యాల నుండి బయటపడటానికి ప్రత్యేకమైన ఇంటి నివారణల కోసం ప్రయత్నిస్తారు. చిన్నారులకు ముక్కు మూసుకుపోయినప్పుడు తమలపాకులను ఉపయోగించి సాంప్రదాయ వైద్యం ద్వారా తీవ్రతను తగ్గించొచ్చు.
4-5 తమలపాకులకు ఆముదం రాసి పెనం మీద వేడి చేయాలి. గోరు వెచ్చగా అయిన తరువాత ఆకులను తీసి చిన్నారుల ఛాతి మీద ఉంచాలి. ఇది లోపలి కఫాన్ని కరిగిస్తుంది. ఆకులు ఛాతి మీద 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి.
తమలపాకులో వైద్య గుణాలు అధింకంగా ఉన్నాయి. కడుపు నొప్పిని తగ్గించడానికి, దద్దుర్లు వంటి చర్మ సంబంధిత వ్యాధుల నుంచి నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకులు క్రిమి నాశక లక్షణాలు కలిగి ఉంటాయి.
తమలపాకులు యాంటీఆక్సిడేషన్, యాంటీమ్యుటేషన్ లక్షణాలు ఫుష్కలంగా ఉన్నాయని చైనీస్ వైద్యులు సైతం పేర్కొన్నారు. నోటి పరిశుభ్రతలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. యాంటీ-డయాబెటిక్, కార్డియోవాస్కులర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ/ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ అల్సర్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి.
అలాగే, మెంతోలేటెడ్ లేపనాలు జాగ్రత్తగా వాడాలి. సాధారణంగా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సొంత వైద్యం చేయకపోవడమే మంచిది. పిల్లల వైద్యుల సలహా మేరకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా పైనున్న అంశాలను మీకు అందివ్వడం జరిగింది. ఇది వైద్యుల చికిత్సకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోగలరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com