Bhagyashree: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే భాగ్యశ్రీ చెప్పే వెయిట్ లాస్ టిప్స్ మీ కోసం..

Bhagyashree: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే భాగ్యశ్రీ చెప్పే వెయిట్ లాస్ టిప్స్ మీ కోసం..
Bhagyashree: ఎప్పటి నుంచో ఎందుకు ఈ రోజు నుంచే మొదలు పెట్టేస్తే సరి.. ఉగాది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది..

Bhagyashree: అద్దంలో చూసుకున్న ప్రతిసారి అడ్డంగా పెరిగి పోతున్న నడుమును చూసి బాధేస్తుంది. బరువు తగ్గాలని బలవంతంగా ప్రణాళికలు వేసుకున్నా రుచికరమైన పదార్థాలు చూస్తే నోరూరిపోతుంది. దాంతో వెయిట్ లాస్ ప్రాజెక్ట్ అటకెక్కుతుంది.

ఏదైనా గట్టిగా అనుకుంటేనే అది సాధ్యమవుతుంది.. ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.. తిండి మీద నియంత్రణ ఉండాల్సిందే. ఆహారానికి తోడు వ్యాయామం కూడా ఉంటేనే అనుకున్న రిజల్ట్ వస్తుంది..

ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ప్రేమపావురాలు ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ ఇప్పుడు రాథేశ్యామ్ లో ప్రభాస్ కి తల్లిగా కనిపించి వావ్ అనిపించింది భాగ్యశ్రీ. ఎదిగిన కొడుక్కి తల్లి అయినా ఏ మాత్రం చెరగని అందం. ఫిట్ నెస్ ని కాపాడుకోవడానికి తనేం చేస్తోందో తెలియజేస్తోంది.

మనం కూడా ఫాలో అయితే మంచిదే కదా.. ఎప్పటి నుంచో ఎందుకు ఈ రోజు నుంచే మొదలు పెట్టేస్తే సరి.. ఉగాది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.. స్లిమ్ గా ఉండాలన్న మీ కోరిక నెరవేరుతుంది.. మరి భాగ్య శ్రీ చెప్పిన ఆ వెయిట్ లాస్ టిప్స్ ఏంటో తెలుసుకుందామా..

దాదాపు ఒక సంవత్సరం పాటు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిగా, వెయిట్ లాస్ కోసం మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం ఎంత ముఖ్యమో నేను మీకు తెలియజేస్తాను. ఇది బరువు తగ్గడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగానూ ఉంచుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యంగా జీవించడం బరువు తగ్గడంలో ముఖ్యమైన భాగం. అయితే, బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారాన్ని అనుసరించే విషయానికి వస్తే, మనలో చాలా మందికి ఏమి తినాలో తెలియక తికమక పడుతుంటారు.


మీరు ఇంటర్నెట్‌లో అధిక-ప్రోటీన్, తక్కువ కేలరీలు ఉన్న బరువు తగ్గించే వంటకాలను గురించి తెలుసుకొని ఉంటారు. వాటిలో కొన్ని మన దగ్గర ఉండవు. కాబట్టి, ఆ సమయంలో ఏమి చేయాలి అనే సందేహం మీకు కలుగుతుంది. భాగ్యశ్రీ దగ్గర మీ కోసం చక్కని పరిష్కారం ఉంది.

భాగ్యశ్రీ ఇంకా ఇలా రాసుకొచ్చింది.. "మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే వాటర్ వెజిటేబుల్స్ తినండి. మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. మన శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడానికి నీటి ప్రాధాన్యత చాలా ఉంది.

శరీరంలో 70% నీరే ఉంటుంది. నీటి ద్వారా శరీరంలో టాక్సిన్స్ తొలగించబడతాయి. మనం రోజువారి తీసుకునే నీటితో పాటు నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ కూరగాయలు ఏంటో చూద్ధాం.

"పొట్లకాయ, బచ్చలికూర, టొమాటో, క్యాబేజీ, దోసకాయ, పాలకూర, గుమ్మడికాయ వంటి కూరగాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయల్లో డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు దోహదపడతాయి. ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇంకా వీటిల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. డైట్‌లో ఉన్నవారికి లేదా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇవి సరైన కూరగాయలు." అని భాగ్యశ్రీ పోస్ట్ లో తెలిపింది.

కాబట్టి, మీరు కూడా బరువు తగ్గాలని అనుకున్నట్లైతే కచ్చితంగా భాగ్యశ్రీ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. వారానికి ఏడు రోజులు .. ఆ ఏడు రోజులు ఈ ఏడు కూరగాయలను రోజుకు ఒకటి చొప్పున వండుకుని తింటే ఆరోగ్యానికీ మంచిది.. అందంగానూ ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story