Blood Pressure: ఈ అయిదు ఆహారంలో చేర్చుకుంటే.. బీపీ కంట్రోల్‌..

Blood Pressure: ఈ అయిదు ఆహారంలో చేర్చుకుంటే.. బీపీ కంట్రోల్‌..
Blood Pressure: బీపీ (బ్లడ్ ప్రెషర్) కంట్రోల్‌లో ఉంచుకోకపోతే దానివల్ల శరీరంలోని మిగతా అవయవాలు డ్యామేజ్ అవుతాయి. అందుకే డాక్టర్లు పదే పదే చెబుతుంటారు.. రక్తపోటును అశ్రద్ధ చేయవద్దు అని.

Blood Pressure: బీపీ (బ్లడ్ ప్రెషర్) కంట్రోల్‌లో ఉంచుకోకపోతే దానివల్ల శరీరంలోని మిగతా అవయవాలు డ్యామేజ్ అవుతాయి. అందుకే డాక్టర్లు పదే పదే చెబుతుంటారు.. రక్తపోటును అశ్రద్ధ చేయవద్దు అని. 5 హోం రెమెడీస్ అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

బీపీ సాధారణ జీవనశైలిలో వచ్చే స్వల్ప మార్పు. బీపీ పెరుగుతోందని కంగారు పడకుండా రక్తపోటును అదుపులో ఉంచేందుకు కొన్ని ఇంటి చిట్కాలు పాటించి చూడండి.

రక్తపోటు అనేది చాలా మంది సీనియర్ సిటిజన్లను బాధించే కార్డియోవాస్కులర్ డిసీజ్. అయితే ఇప్పుడు యువ తరం కూడా బీపీతో బాధపడుతోంది. ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా అదుపులో ఉంచవచ్చు.

అధిక రక్తపోటు ఉన్నవారు తాము తినే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మసాలా ఆహారం, ఉప్పు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

ఆరోగ్య సంబంధిత జర్నల్స్ ప్రకారం ఆహారంలో మార్పులు రక్తపోటును తగ్గిస్తాయి, రక్తపోటు అభివృద్ధిని నిరోధిస్తాయి.. రక్తపోటు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. హైపర్ టెన్షన్ నివారణకు ఆహారంలో సోడియం తీసుకోవడం తగ్గించాలి. ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయడం, పొటాషియం తీసుకోవడం పెంచడం చేయాలి.

కాబట్టి, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, రక్తపోటును నిర్వహించడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి..

అవి 1. అరటిపండ్లు.. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.



2. ఓట్స్.. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటును తగ్గిస్తుంది.



3. బీట్‌రూట్.. ఈ రూట్ వెజిటబుల్‌లో నైట్రేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 2012 అధ్యయనం ప్రకారం, ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగితే రక్తపోటు ఐదు పాయింట్లు తగ్గుతుంది. ప్రతిరోజూ తాగితే దీని ప్రభావం దీర్ఘకాలంలో గణనీయంగా పెరుగుతుంది.



4. ఆరెంజ్.. రక్తపోటు తగ్గించుకోడానికి తినాల్సిన మరో ముఖ్యమైన పండు ఆరెంజ్.. ఇందులో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోజూ ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం లేదా ఒక పండు తినడం చేయాలి.




Tags

Read MoreRead Less
Next Story