Bollywood: బాలీవుడ్ బ్యూటీస్ ఫిట్‌నెస్ సీక్రెట్..

Bollywood: బాలీవుడ్ బ్యూటీస్ ఫిట్‌నెస్ సీక్రెట్..
Bollywood: సినిమాతారలు ఫిట్ గా ఉండకపోతే ఎలా అని అనుకుంటాం కానీ.. ఆఫర్ల సంగతి పక్కన పెడితే వాళ్ల డెడికేషన్ ని చూస్తే ముచ్చటేస్తుంది..

Bollywood: సినిమాతారలు ఫిట్ గా ఉండకపోతే ఎలా అని అనుకుంటాం కానీ.. ఆఫర్ల సంగతి పక్కన పెడితే వాళ్ల డెడికేషన్ ని చూస్తే ముచ్చటేస్తుంది.. వాళ్ల నుంచి నేర్చుకోవలసింది కూడా చాలా ఉందనిపిస్తుంది. మాతృత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు బిడ్డ ఆరోగ్యం కోసం డాక్టర్ల సూచన మేరకు మంచి డైట్ తీసుకుంటారు.. ఆ తరువాత పెరిగిన బరువు అంతా తగ్గించుకునేందుకు వర్కవుట్లు చేస్తారు. మునుపటి శరీరాన్ని సొంతం చేసుకుంటారు.. నటనను కూడా వృత్తిగా భావించి వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటారు.

నేటి బిజీ లైఫ్, ఒత్తిడితో కూడిన జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం నిజంగా ఒక పెద్ద టాస్క్ లాంటిదే. సెలబ్రిటీల ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామ విధానం తెలుసుకుందాము. నిజానికి నటీనటులకు సమయ పాలన సరిగా ఉండదు. ఒక్కోసారి అర్థరాత్రి కూడా షూటింగ్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా ఆరోగ్యం మీద దృష్టి పెడతారు.

ప్రతి రోజూ వ్యాయామానికి తగినంత సమయాన్ని కేటాయిస్తారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్‌ను అనుసరించడంతో పాటు వ్యాయామం కోసం సమయాన్ని నిర్వహించుకుంటారు. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తారు. ప్రముఖ బాలీవుడ్ నటీమణుల ఫిట్‌నెస్, డైట్ ప్లాన్‌లను చూద్దాం

దీపికా పదుకొణె బాలీవుడ్‌ను శాసిస్తున్న నటీమణులలో ఒకరు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. దీపికా కేవలం స్లిమ్‌గా కాకుండా ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉండాలని నమ్ముతుంది. ఆమె క్రమశిక్షణ, కఠోర శ్రమ & కఠినమైన ఆహారపు అలవాట్లకు నిదర్శనం ఆమె టోన్డ్ బాడీ.

దీపికా ఫిట్‌నెస్ రహస్యాలు:

కఠినమైన కార్డియాక్ వ్యాయామాలు చేస్తుంది. యోగాలో సూర్య నమస్కార్ వంటి ఆసనాలు చేస్తుంది. మనస్సు ప్రశాంతత కోసం ప్రాణాయామం & ధ్యానం కూడా చేస్తుంది. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు వాకింగ్, స్విమ్మింగ్ వంటి కొన్ని శారీరక శ్రమను కలిగించే వ్యాయామాలు చేస్తుంది. అదనపు కేలరీలను తగ్గించుకునేందుకు ఒక్కోసారి డ్యాన్స్ కూడా చేస్తుంది.

ఆమె ఆహార రహస్యాలు:

ఇష్టమైన ఆహారాన్ని తగ్గించుకోవడం నచ్చదు.. ఫుల్లుగా లాగించేస్తుంది.. దానికి తగ్గట్టు వ్యాయామం చేస్తుంది. ప్రతి రెండు గంటలకు తక్కువ పరిమాణంలో భోజనం చేస్తుంది. తాజా పండ్లు తింటుంది. ఆహారంలో ప్రోటీన్లు & కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకుంటుంది. చాక్లెట్‌లు అంటే చాలా ఇష్టం. నీరు ఎక్కువగా త్రాగుతుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు తోలి శరీరం మెరిసేలా చేస్తుంది వాటర్ అని అంటుంది దీపిక.

కరీనా కపూర్

కరీనా బాలీవుడ్‌లో ఒక స్టైల్ ఐకాన్ . ఆమె చాలా కష్టపడి పనిచేసిన చిత్రం తాషాన్. ఇందులో ఆమె సైజ్ జీరో ఫిగర్ తో అందరి దృష్టిలో పడింది. కరీనా కార్డియో వ్యాయామాలు చేస్తుంది కానీ యోగా చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ప్రతిరోజూ కనీసం రెండు గంటలు యోగాకు కేటాయిస్తుంది. సూర్య నమస్కార్, భుజంగాసన, వీరభద్ర & బిక్రమ్ యోగాలతో పాటు పవర్ యోగా చేయడం కరీనాకు చాలా ఇష్టం. కార్డియోలో రన్నింగ్, బైకింగ్, స్విమ్మింగ్ ఉంటాయి. కరీనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంది. కఠినమైన వ్యాయామ నియమాలను అనుసరిస్తుంది.

ఏ ఆహారమైనా ఇష్టంగా తింటుంది. బరువు తగ్గడం కోసమని రోజుల తరబడి ఆహారం లేకుండా ఉండడాన్ని ఇష్టపడదు. నిజానికి, తన ఆహారంలో చక్కెరలు & నెయ్యిని కూడా తీసుకుంటుంది. అయితే ఏవి తిన్నా మితంగా ఉండేలా చూసుకుంటుంది. ప్రతిరోజూ కనీసం 6-8 గ్లాసుల గోరు వెచ్చని నీరు త్రాగుతుంది. గోరు వెచ్చని నీరు శరీరంలో పేరుకున్న ఫ్యాట్ ని కరిగిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story