Breakfast: బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా.. అయితే కచ్చితంగా మీరు బరువు..

Breakfast: బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా.. అయితే కచ్చితంగా మీరు బరువు..
పోషకాలు అధికంగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు

Breakfast: ఆఫీస్‌కి టైమైపోతుందని హడావిడిగా బయల్దేరుతుంటారు. ఇంక అల్పాహారానికి టైమెక్కడ అని ఆ పూటకి అలా కానిచ్చేద్దామనుకుంటారు. త్వరగా భోజనం చేసేయొచ్చులే అని చాలా మంది బ్రేక్ ‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. మరి కొంత మంది వెయిట్ తగ్గాలని బ్రేక్ ‌ఫాస్ట్ మానేస్తుంటారు. కానీ పోషకాహార నిపుణులు చెప్పేదేమంటే.. ఈ రెండూ తప్పే. మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పోషకాలు అధికంగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు. అది మీ రోజువారీ జీవనశైలిపై ప్రభావం చూపుతుంది అని అంటున్నారు.

అల్పాహారం మీ జీవక్రియను ప్రారంభిస్తుంది. రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది పనులను పూర్తి చేయడానికి మీకు అవసరమైన శక్తిని ఇస్తుంది. చేస్తున్న పనిపట్ల దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుంది. ఇది ఆ రోజు యొక్క అతి ముఖ్యమైన భోజనం అని గుర్తుంచుకోండి.

అనేక అధ్యయనాలు అల్పాహారం తినడం మంచి ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని పేర్కొంటున్నాయి. జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతకు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు, డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువును నివారించేందుకు బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరాన్ని తెలుపుతాయి.

అల్పాహారం ఆరోగ్యకరమైన అలవాట్లకు కారణమవుతుందా లేదా తినేవారికి ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆధారపడి ఉంటుందా అనేది తెలుసుకోవడం చాలా కష్టం.

కానీ ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మీరు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు, మీ కండరాలు మరియు మెదడు పని చేయడానికి మీ శరీరానికి అవసరమైన రక్తంలో చక్కెర సాధారణంగా తక్కువగా ఉంటుంది. అల్పాహారం దాన్ని తిరిగి నింపడానికి సహాయపడుతుంది.

మీ శరీరానికి తగిన పోషకాలు అందకపోతే మీకు శక్తిని కోల్పోయినట్లు అనిపించవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ తిన్లేదు కదా అని ఒక్కసారే లంచ్ కూడా ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది.

అల్పాహారంలో పాలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాల నుండి కొన్ని విటమిన్లు మరియు పోషకాలను పొందటానికి అవకాశం ఉంటుంది. మీరు అల్పాహారం తినకపోతే, మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను మీరు పొందలేరు.

ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితంలో అల్పాహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వరు. అది పొరపాటు. భోజన సమయానికి చాలా ముందు మీ బాడీ సిస్టమ్‌లో మీకు ఆహారం చాలా అవసరం.

అల్పాహారం మరియు మీ బరువు

సగటున, అల్పాహారం తినేవారు తినని వారి కంటే సన్నగా ఉంటారని పరిశోధకులు కనుగొన్నారు. ఉదయాన్నే ప్రోటీన్ మరియు ఫైబర్‌తో ఆహారాన్ని తినడం వల్ల మధ్యాహ్న భోజన సమయం వరకు మీ ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు.

మరోవైపు, మీరు ఏమి, ఎప్పుడు, ఎంత తింటారు అనే దానిపై శ్రద్ధ వహించాలి.

పిల్లలకు అల్పాహారం ఎందుకు కావాలి

కొన్నిసార్లు పిల్లలు ఉదయాన్నే తినడానికి ఇష్టపడదరు. కానీ అల్పాహారం తినడం చాలా ముఖ్యం. వారి ఎదుగుదలకు కావలసిన పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. త్వరగా అలసిపోతారు. ఒక అధ్యయనం ప్రకారం అల్పాహారం తిన్న పిల్లలు చేయని వారి కంటే ఎక్కువ పరీక్ష స్కోర్లు కలిగి ఉన్నారు.

అల్పాహారం దాటవేసే పిల్లలు పగటిపూట జంక్ ఫుడ్ తినడం వలన అధిక బరువు కలిగి ఉంటారు. పిల్లలు ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటిని తినడానికి పండ్లు, పీనట్ బటర్ లాంటివి ఎంచుకోవచ్చు.

మేల్కొన్న గంటలోపు ఏదైనా తినడం మంచిది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ కలిగిన ఆహారాల మిశ్రమం మీ అల్పాహారంలో చేర్చుకోవడం ఉత్తమం. పిండి పదార్థాలు మీకు వెంటనే శక్తిని ఇస్తాయి, శరీరానికి కావలసిన ప్రోటీన్‌ను అందిస్తుంది. తృణధాన్యాలు, తక్కువ కొవ్వు గల పాలు, పండ్లు కూడా ఉత్తమమైన అల్పాహారాలు.

Tags

Read MoreRead Less
Next Story