హెల్త్ & లైఫ్ స్టైల్

Vijay Devarakonda Breakup: బ్రేకప్ వల్ల ఎక్కువగా బాధపడేది వారే.. విజయ్ దేవరకొండ కూడా..

Vijay Devarakonda Breakup: ప్రేమ.. ఇది అన్నింటికంటే స్ట్రాంగ్ అయిన ఒక ఎమోషనల్ ఫీలింగ్ అని అందరు అంటుంటారు.

Vijay Devarakonda Breakup: బ్రేకప్ వల్ల ఎక్కువగా బాధపడేది వారే.. విజయ్ దేవరకొండ కూడా..
X

Vijay Devarakonda Breakup: లవ్, బ్రేకప్ అనేవి ఈరోజుల్లో చాలా కామన్‌గా జరుగుతున్న విషయాలే. లవ్‌కు ఎలాంటి తేడాలు తెలియవంటారు. అందుకే హీరో విజయ్ దేవరకొండకి కూడా ఒక లవ్ స్టోరీ ఉందట. కానీ అది చివరికి బ్రేకప్ స్టోరీగా మిగిలిపోయిందని ఇటీవల విజయ్ అందరి ముందు వెల్లడించాడు. తాను ఇప్పటికీ ఆ బ్రేకప్ నుండి బయటికి రాలేకపోతున్నానని విజయ్ బయటపెట్టాడు. దీంతో లవ్, బ్రేకప్ అంశాలపై టాలీవుడ్లో చర్చ మొదలయింది.

ప్రేమ.. ఇది అన్నింటికంటే స్ట్రాంగ్ అయిన ఒక ఎమోషనల్ ఫీలింగ్ అని అందరు అంటుంటారు. బలంతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చని కూడా కొందరి వాదన. మరి అందరికీ ప్రేమ మీద పాజిటివ్ అభిప్రాయం మాత్రమే ఉంటుందా..? ఎవరికీ నెగిటివ్ అభిప్రాయం ఉండదా..? అంటే పొరపాటే మరి.. ప్రేమను సపోర్ట్ చేసే వారు ఎంతమందో.. దాన్ని అంతేమంది సమానంగా కొట్టిపారేస్తారు. ప్రేమ, బ్రేకప్ అనేవి ఒక మనిషిని మానసికంగా బలహీనంగా చేస్తాయని వీరి వాదన. అయితే అది నిజమే అంటున్నాయి ఆధ్యయనాలు.

ప్రేమ అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో.. అది దూరమయినప్పుడు భరించలేనంత బాధ కూడా ఉంటుంది. లవ్, బ్రేకప్ ఈరోజుల్లో కామన్. కానీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు.. ఒక మనిషి ఇష్టం లేదని విడిపోయిన తర్వాత మరో మనిషి పరిస్థితి ఏంటి..? ఒకవేళ ఇద్దరు అనుకునే విడిపోయినా కూడా ఎంతోకొంత బాధ అయితే ఉంటుంది కదా.. మరి మగవారు, ఆడవారిలో ఎవరు ఎక్కువగా బాధపడతారు అన్న అంశంపై నిపుణులు ఒక నిర్ధారణకు వచ్చారు.

బ్రేకప్ అనేది ఎవరిని ఎక్కువగా బాధపెడుతుంది..? మగవారినా..? ఆడవారినా..? తెలుసుకోవడానికి లాన్‌కాస్టర్ యూనివర్సిటీ వారు ఒక సర్వేను నిర్వహించారు. ఛార్లెట్ ఎంట్‌విస్టల్ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించబడింది. మొత్తం 1,84,000 మందితో ఈ సర్వేను నిర్వహించారు. అయితే ఒక రిలేషన్‌షిప్ బ్రేకప్ అయినప్పుడు ఆడవారి కంటే ఎక్కువ మగవారే బాధపడతారని ఈ సర్వే ద్వారా వెల్లడైందని సమాచారం.

మగవారి చూడడానికి రఫ్‌గా కనిపించినా వారే ఎక్కువ బ్రేకప్ వల్ల బాధపడతారని సర్వే ద్వారా తెలిసిందని ఛార్లెట్ తెలిపారు. రిలేషన్‌షిప్‌లో సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి..? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి..? లాంటి విషయాలను ఎవరూ పట్టించుకోరు.. ఇదే చాలావరకు బ్రేకప్స్‌కు కారణామని ఛార్లెట్ అన్నారు.

Next Story

RELATED STORIES