Breast Milk: తల్లి పాలను పెంచడానికి 3 సూపర్ ఫుడ్స్..

Breast Milk: తల్లి పాలను పెంచడానికి 3 సూపర్ ఫుడ్స్..

Breast Milk 

Breast Milk: డబ్బా పాలకంటే అమ్మపాలే బిడ్డకు ఆరోగ్యం అన్న సంగతి తెలిసినా స్థన్యంలో పాలు రాక తల్లి ఆవేదన చెందుతుంది.

Breast Milk: అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే పుట్టిన పాపాయి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. డబ్బా పాలకంటే అమ్మపాలే బిడ్డకు ఆరోగ్యం అన్న సంగతి తెలిసినా స్థన్యంలో పాలు రాక తల్లి ఆవేదన చెందుతుంది. చిన్నారికి తన పాలు పట్టలేకపోతున్నానన్న బాధ ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే స్థన్య వృద్ధిని పెంచుకోవచ్చు. అవేంటో చూద్దాం..

ఆరోగ్య సమస్యలు, శారీరక / మానసిక ఒత్తిడి లేదా కొన్ని ఇతర కారణాల వల్ల తల్లులు తక్కువ తల్లి పాలు సరఫరా సమస్యను ఎదుర్కొంటారు. నవజాత శిశువు పూర్తిగా తల్లి పాల మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ పాలు బిడ్డకు సరిపోకపోతే అది చాలా కష్టమైన పరిస్థితి. సహజంగా తల్లి పాలను సరఫరా చేయడానికి కొన్ని హోం రెమెడీస్ పాటు కొన్ని డైట్‌లో మార్పులు సహాయపడతాయి.

పాలిచ్చే తల్లికి సమతుల్య ఆహారం, సరైన విశ్రాంతి మరియు తగినంత నీరు త్రాగటం అవసరం. ఇంకా తాజా పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు మరియు తాజాగా ఇంట్లో వండిన ఆహారం తల్లి పాలు సరఫరాను పెంచుతాయి. తల్లి ఎక్కువ పాలు తాగడం, రోటీ, డౌ వంటి వాటిని వంటకాల్లో చేర్చడం, ఖీర్, గంజి వంటివి కూడా పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.

తల్లి పాలను పెంచడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి.

1. మెంతి గింజలు (మేథి విత్తనాలు)

మెంతి విత్తనాలు విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్, ఖనిజాలు మరియు కేలరీల మూలం. ఈ విత్తనాలలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రుచిలో చేదుగా ఉన్నా శిశువు యొక్క మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.

తరచుగా మెంతి గింజల కూర చేసుకుని తింటే పాలు ఎక్కువగా పడతాయి. ఈ కూర ఎలా చెయ్యాలో చూద్దాం..

చెంచా మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. పాన్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. అవి కొంచెం వేగిన తరువాత నానబెట్టిన మెంతి గింజలు వేయాలి. ఓ నిమిషాలు కలియబెట్టిన తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కొంచెం నీరు పోసి కలపాలి. 5 నుండి 6 నిమిషాలు ఉడికించాలి. ఈ మెంతి కూరను రోటీతో కానీ అన్నంతో కానీ తినవచ్చు.

2. మెంతి స్మూతీ

ఎలా చెయ్యాలి : చెంచా మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఈ మెంతి గింజలను గ్రైండ్ చేయాలి. తియ్యగా కావాలనుకుంటే దానిలో చక్కెర కలపాలి. పాలిచ్చే తల్లులు ప్రతిరోజూ ఉదయం ఈ స్మూతీని త్రాగాలి.

2. సోంపు గింజలు..

సాధారణంగా భోజనానంతరం జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు సోంపు నమలడం చాలా మందికి అలవాటు. అయితే అవే సోంపు గింజలు పాల ఉత్పత్తిని పెంచుతాయనే విషయం చాలా మందికి తెలియదు. డెలివరీ తర్వాత తల్లులకు ఫెన్నెల్ సీడ్స్ (సోంపు ) వాటర్ లేదా ఫెన్నెల్ టీ తాగితే పాలు పడతాయి.

సోపు గింజలను ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు

200 గ్రాముల సోపు గింజలు, 50 గ్రాముల వాము, 50 గ్రాముల నువ్వులను విడిగా వేయించుకోవాలి. అన్ని విత్తనాలు వేగించిన మిశ్రమంలో 20 గ్రాముల రాక్ ఉప్పు కలపాలి.

అన్ని పదార్థాలను బాగా కలపండి మరియు ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖ్వాస్ అని పిలుస్తారు. భోజనానంతరం ప్రతి రోజూ 1 టీ చెంచా తీసుకుంటే పాలు పడతాయి.

3.అహ్లైవ్ (గార్డెన్ క్రెస్ విత్తనాలు / చియా విత్తనాలు)

చియా విత్తనాలు.. వీటిల్లో ఇనుము మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డెలివరీ పెయిన్స్ నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. అలాగే తల్లి పాలను పెంచేందుకు సహాయం చేస్తుంది. అయితే ఈ విత్తనాలను వైద్యుల సూచనతో మాత్రమే తీసుకోవాలి.

ఎలా చెయ్యాలి : ఒక చెంచా చియా విత్తనాలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. బాణలిలో నీరు మరిగించి ఈ విత్తనాలను వేడి నీటిలో కలపాలి. అందులో తగినంత చక్కెర, ఒక చెంచా నెయ్యి, 1 కప్పు పాలు కలపాలి. ఈ ఖీర్‌ను 5 నుండి 6 నిమిషాలు ఉడికించాలి. చిటికెడు ఏలకుల పొడి చల్లి వేడిగా తీసుకుంటే అమ్మకి ఆరోగ్యంతో పాటు పాపాయికి బొజ్జ నిండుగా పాలు వస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story