Cerebral Palsy: ఏమిటీ సెరిబ్రల్ పాల్సీ.. సత్యనాదెండ్ల కుమారుడు ఈ వ్యాధితోనే 26 ఏళ్ల వయసులో..

Cerebral Palsy: ఏమిటీ సెరిబ్రల్ పాల్సీ.. సత్యనాదెండ్ల కుమారుడు ఈ వ్యాధితోనే 26 ఏళ్ల వయసులో..
Cerebral Palsy: సత్య నాదెళ్ల కుమారుడు 26 ఏళ్ళ వయసులో సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం) తో మరణించడంతో వైద్యులు నివారణ చిట్కాలను పంచుకున్నారు.

Cerebral Palsy: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం కన్నుమూశారు. అతని వయస్సు 26 సంవత్సరాలు. సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. జైన్ మరణంతో వైద్యులు ఈ వ్యాధిపై మరోసారి అవగాహన కల్పిస్తున్నారు. లక్షణాలు, చికిత్స, నివారణ వంటి విషయాల గురించి వివరిస్తున్నారు.

భారతదేశంలో ప్రతి వెయ్యి మంది శిశువులకు ముగ్గురు పిల్లలు సెరిబ్రల్ పాల్సీ లేదా బ్రెయిన్ డ్యామేజ్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా చేతులు లేదా కాళ్లపై నియంత్రణ కోల్పోవడం, శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. సెరిబ్రల్ అంటే మెదడుకు వచ్చే పక్షవాతం. ఇది నైపుణ్యాలను ప్రభావితం చేసే నాడీ సంబంధిత రుగ్మత.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. జైన్ చికిత్స పొందిన చిల్డ్రన్స్ హాస్పిటల్ CEO జెఫ్ స్పెరింగ్ మాట్లాడుతూ.. మెదడు అభివృద్ధి దెబ్బతింటే, అది సెలెబ్రల్ పాల్సీకి దారి తీస్తుంది. ఇది ప్రధానంగా శిశువు కడుపులో ఉన్నప్పుడు లేదా డెలివరీ సమయంలో జరుగుతుంది. శిశువులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.

నివారణ మార్గాలు..

పుట్టిన తర్వాత పిల్లలలో సెరిబ్రల్ పాల్సీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి, తల్లిదండ్రులు తమ బిడ్డకు అన్ని సాధారణ శిశు ఇన్ఫెక్షన్‌లకు సంబంధించిన టీకాలు వేయించారో లేదో నిర్ధారించుకోవాలి. పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి.

ఒక్కోసారి సెరిబ్రల్ పాల్సీ వ్యాధి బాల్యంలో తలకు గాయాలు కావడం వల్ల కూడా వస్తుంది. గర్భధారణ సమయంలో, డెలివరీ సమయంలో ఏర్పడే సమస్యల వల్ల కూడా వస్తుంది.

డాక్టర్ ఆత్మ రామ్ బన్సాల్ ప్రకారం, గర్భధారణ సమయంలో, డెలివరీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం వలన సెరిబ్రల్ పాల్సీని నివారించవచ్చు. "పిల్లల మెదడు అభివృద్ధికి సంరక్షణ చాలా ముఖ్యం. డెలివరీ సమయంలో మెరుగైన అబ్స్ట్రక్టికల్ కేర్‌తో, పరిస్థితిని నియంత్రించవచ్చు. భారతదేశంలో సెరిబ్రల్ పాల్సీ కేసులు తక్కువగానే ఉంటాయి.. కారణం ఇక్కడ నర్సింగ్ కేర్ ఎక్కువగా ఉంటుంది.

కారణాలు..

గర్భధారణ సమయంలో బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి.

శిశువు ఎదుగుదలకు పోషకాహార లోపం

గర్భిణీ దశలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడితే..

శిశువు పుట్టిన వెంటనే ఆక్సిజన్ అందకపోయినా

శిశువుకు చక్కెర స్థాయిలు తగ్గినా

బిడ్డ పుట్టిన రెండేళ్లలోపు మెదడుకు మెనింజైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లు సోకితే.. మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావం తలకు బలమైన గాయమై మెదడులో రక్తస్రావం జరిగినా మెదడు దెబ్బతింటుంది.

శిశువులో గమనించవలసిన లక్షణాలు..

ఆర్నెల్లు దాటిన చిన్నారి మెడ నిలపలేకపోయినా

3 నెలలు దాటినా చూడలేకపోతే..

4-6 నెలల వయసులో ఉన్నట్టుండి ఫిట్స్ వస్తుంటే

ఎదుగుదల లేకపోతే..

పై లక్షణాలు శిశువులో గమనించినట్లైతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. శారీరక కదలికలు తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించాల్సి ఉంటుంది. ఫిట్స్ వస్తుంటే దానికి సంబంధించిన మందులు వాడాలి. పోషకాహారాన్ని అందించాలి. గర్భిణిగా ఉన్న దశ నుంచి పోషకాహారం స్వీకరించాలి. అవసరమైన టీకాలు వేయించుకోవాలి.. బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రసవ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శిశువు పుట్టిన తరువాత తలకు గాయాలు తగలకుండా చూసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story