Chaddannam: వేసవిలో చద్దన్నం.. ఇందులో ఉన్న ప్రోబయోటిక్, విటమిన్ B12 శరీరానికి..

Chaddannam: వేసవిలో చద్దన్నం.. ఇందులో ఉన్న ప్రోబయోటిక్, విటమిన్ B12 శరీరానికి..
Chaddannam: ఉదయం తయారు చేసి, రాత్రి తింటామంటే ఉపయోగం ఉండదు.

Chaddannam: చద్దన్నం ఏ పేరుతో పిలిచినా, ఎక్కడ తిన్నా ఒకే విధంగా ఉంటుంది.. వేసవి కాలంలో చద్ధన్నం తినమని చెబుతారు ఇంట్లోని పెద్దవాళ్లు. వేడి చేయకుండా ఉంటుందని, ఎండ వేడిమిని తట్టుకునే శక్తి శరీరానికి ఉంటుందని.

ఇది ఒక సాధారణ వంటకం. రాత్రిపూట పులియబెట్టి, మరుసటి రోజు ఉదయం అల్పాహారంగా తీసుకుంటారు. ఇందులో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే మజా వస్తుంది.

ఈ వంటకం శరీరానికి చాలా చల్లదనాన్ని కలిగిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగే వేసవి కాలంలో ఇది దివ్యౌషధంగా ఉంటుంది. చద్దనంలో ప్రోబయోటిక్, విటమిన్ B12 లో సమృద్ధిగా ఉంటాయి.




తమిళనాడులో పజాయ సాదం , ఒడిశాలో పాఖాలా భట్ , అస్సాంలో పోయిటా భట్, బెంగాల్ లో పంట భట్, ఇతర దక్షిణ తూర్పు భారత రాష్ట్రాల్లో చద్దన్నం అని ఏ పేరుతో పిలిచినా దానికి ఉపయోగాలు అమోఘం.

చద్దన్నం రాత్రిపూట తయారు చేసి ఉదయాన్నే తినాలి. ఇది శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. ఉదయం తయారు చేసి, రాత్రి తింటామంటే ఉపయోగం ఉండదు.

చద్దన్నం ఎలా తయారు చేయాలి

కావలసినవి

వండిన అన్నం - 2 కప్పులు

పెరుగు – 1 కప్పు

పాలు - 1 కప్పు

ముక్కలు చేసిన ఉల్లిపాయలు - 2 మీడియం

తరిగిన పచ్చిమిర్చి - 3 లేదా 4

రుచికి ఉప్పు

చద్దన్నం చేసే విధానం (సాయంత్రం లేదా రాత్రి చేయండి)

పాలు గోరు వెచ్చగా ఉండే వరకు వేడి చేయండి.

ఒక మట్టి కుండ తీసుకుని అందులో వండిన అన్నం, పెరుగు, గోరువెచ్చని పాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

రాత్రిపూట 8 నుండి 10 గంటలు పక్కన పెట్టండి . ఉదయం బాగా కలిపి పక్కన కొద్దిగా ఆవకాయతో అల్పాహారంగా తీసుకుంటే మంచిది.

ఈ చద్దన్నంలో ఉండే పోషకాలు, కేలరీలు

కేలరీలు: 235 కిలో కేలరీలు

కార్బోహైడ్రేట్లు: 37 గ్రా

ప్రోటీన్: 10 గ్రా

కొలెస్ట్రాల్: 6 మి.గ్రా

సోడియం: 439 మి.గ్రా

పొటాషియం: 188 మి.గ్రా

ఫైబర్: 4 గ్రా

చక్కెర: 8 గ్రా

విటమిన్ ఎ: 100 IU

విటమిన్ సి: 14 మి.గ్రా

కాల్షియం: 167 మి.గ్రా

Tags

Read MoreRead Less
Next Story