Plastic Side Effects: ఈ కెమికల్ వల్లే పురుషుల్లో అలాంటి సమస్యలు..

Plastic Side Effects: ఎంత కాదనుకున్నా మన జీవితాల నుండి కొన్నింటిని తీసేయలేము. అందులో ఒకటే ప్లాస్టిక్. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో తెలిసినా.. ఇంకా అదే ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నాం. మన రోజూవారి జీవితంలో ప్లాస్టిక్ లేకుండా ఒక్కరోజు కూడా గడవదు. అయితే దీని వల్ల పర్యావరణానికే కాదు మనిషి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
ప్లాస్టిక్‌లో థాలెట్ అనే కెమికల్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. మనం వాడే షాంపూతో సహా ప్రతీ వస్తువులో ఈ కెమికల్ ఉంటుందట. ఇది మనుషుల్లో హర్మోన్ల వ్యవస్థను వేగంగా నాశనం చేస్తుంది. ప్లాస్టిక్ లేకుండా మనం ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే ఈ కెమికల్ కూడా మన శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తోంది. దీని వల్లే డయాబెటీస్, ఊబకాయం, గుండే జబ్బులు ఎక్కువ అవుతున్నాయని అధ్యాయనాల్లో తెలిపారు.
న్యూయార్క్ యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనలో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల 5000మంది మూత్రంలో థాలెట్‌ల కెమికల్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి వల్లే గుండె జబ్బులు వస్తాయని తెలిపారు. అలాగే పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోవడానికి ఈ థాలెట్ రసాయనమే కారణమని చెప్పారు. దీని వల్ల అమెరికన్లు రకరకాల వ్యాధుల బారినపడి ఏటా 1,00,000 మంది మరణిస్తున్నారని అన్నారు. మన జీవితాల్లో నుండి ఈ ప్లాస్టిక్ పూర్తిగా పోయినరోజే పర్యావరణానికే కాదు మనిషి ఆరోగ్యానికి కూడా మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com