Coffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ

Coffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
Coffee with Ghee: కమ్మటి కాఫీ వాసన ముక్కుపుటాలను తాకగానే ఏదో తెలియని ఉత్సాహం ఒళ్లంతా ఆవరించేస్తుంది.. ఉదయాన్నే చక్కటి కాఫీ సిప్ చేస్తుంటే ఆ రోజంతటికీ కావలసిన ఎనర్జీ వచ్చేసినట్లు అనిపిస్తుంది.

Coffee with Ghee: కమ్మటి కాఫీ వాసన ముక్కుపుటాలను తాకగానే ఏదో తెలియని ఉత్సాహం ఒళ్లంతా ఆవరించేస్తుంది.. ఉదయాన్నే చక్కటి కాఫీ సిప్ చేస్తుంటే ఆ రోజంతటికీ కావలసిన ఎనర్జీ వచ్చేసినట్లు అనిపిస్తుంది. కాఫీలో రకరకాల వెరైటీలు ఉన్నా కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ గురించి తరచూ వింటుంటాము. ఇప్పుడు కొత్తగా కాఫీలో నెయ్యి.. ఆలోచనే కొత్తగా ఉంది.. ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు కాఫీ ప్రియులతో పాటు పోషకాహార నిపుణులు.

కాఫీలో నెయ్యి అనే ఆలోచన ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకుందాం..

కెఫిన్ కలిగిన పానీయాలకు వెన్నను జోడించే ఆచారం 7 వ శతాబ్దం నుండే మొదలైందని అంటారు. బటర్ టీ టిబెట్‌లో ఉద్భవించింది. ఇప్పటికీ హిమాలయ పర్వతాలలో ఉదయం సేవించే ఇష్టమైన పానీయాలలో ఇది ఒకటి.

బటర్ టీని 13 వ శతాబ్దంలో చైనీయులు విస్తృత ప్రపంచానికి తీసుకువచ్చారు. అయితే 2009 వరకు ఈ కాఫీ అంతగా ప్రచారంలోకి రాలేదు. డేవిడ్ ఆస్ప్రే కాఫీ ద్వారా అది ప్రచారంలోకి వచ్చింది. తాజా పాలతో వెన్న తయారు చేస్తారు. దీనిని నెయ్యిగా మార్చి కాఫీలో కలుపుతారు.

కాఫీలో నెయ్యి.. 4 ఆరోగ్య ప్రయోజనాలు:

కాఫీతో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1.డైరీ ఉత్పత్తులు పడనివారు కూడా నెయ్యి వాడొచ్చు.

చాలా మందికి పాలు, పాల ఉత్పత్తులు పడవు.. దీనికి కారణం ఇందులో ఉన్న లాక్టోస్. పాలలోని చక్కెరలు జీర్ణ ప్రక్రియను ఇబ్బందికి గురిచేస్తాయి. కానీ నెయ్యి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

2.అసిడిటీ సమస్యలు ఉన్నవారు

కొంతమందికి ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఇబ్బందిగా ఉంటుంది. కాఫీ తాగాలనిపించినా కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుందని తమ ఇష్టాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ మీ కాఫీ కప్పులో ఒక చెంచా నెయ్యి వేస్తే అది మీ కడుపు నొప్పి నుండి కాపాడుతుంది. నెయ్యిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న బ్యూటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్‌ను కలిగి ఉంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది

అన్ని కొవ్వులు చెడ్డవి కావు. కొన్ని మంచి కొవ్వులు ఉంటాయి. అవి శరీరానికి అవసరం కూడా. ఒమేగా 3s, 6s, 9s వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కొన్ని చేపలు, గింజలు మరియు సముద్రపు పాచిలలో కనిపిస్తాయి. ఇవి కీళ్ళు మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. నెయ్యి కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన ఒక అధ్యయనంలో నెయ్యి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు.

4. నెయ్యి విటమిన్లతో నిండి ఉంటుంది

కాఫీలో నెయ్యి యొక్క మరొక ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే, అదనంగా పోషకాలు అందాతాయి. 100 గ్రాముల నెయ్యిలో విటమిన్ ఎ 61%, విటమిన్ ఇ 14%, విటమిన్ కె 11% ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story