ఉసిరిలో దాగున్న ఔషధగుణాలెన్నో.. రోజూ తీసుకుంటే రోగ నిరోధకశక్తి..

భారతీయ గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఆమ్లా (ఉసిరి) లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. డయాబెటిస్ నియంత్రణకు, జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి, కళ్ళ సమస్యల నివారణకు, చర్మం నిగారింపు కోసం ఉసిరి అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఉసిరిలో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 100 గ్రాముల తాజా ఆమ్లాలో 20 నారింజలలో ఉండే విటమిన్ సి ఉంటుంది.
మరోవైపు, తేనె ఒక అద్భుతమైన దగ్గును అణిచివేసే ఔషధం.ఇది యాంటీవైరల్, యాంటీమైక్రోబయాల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే, చిన్నపిల్లలకు ప్రతిరోజూ ఒక చెంచా తేనెను తినిపిస్తారు. ఇది చక్కెరకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. తేనె ఒక స్పూన్, ఆమ్లా రసం ఒక స్పూన్‌తో కలిపి ప్రతి ఉదయం తీసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.
ప్రతి రోజు ఆమ్ల జ్యూస్‌లో తేనె కలిపి రెండు సార్లు తీసుకుంటే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. ఇందులో ఉన్న అద్భుతమైన యాంటి ఆక్సిడెంట్స్ వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ముఖం ఎల్లప్పుడూ తాజాగా మెరుస్తుంటుంది.
బరువు నియంత్రణకు ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరి తీసుకోవడం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించవచ్చు. ఉసిరి జ్యూస్ రోజూ తాగితే మూత్రనాళ సమస్యలు, మూత్రాశయ మంటను తగ్గిస్తుంది.
శరీరాన్ని చల్లబరిచి కావలసినంత తేమను అందిస్తుంది. రుతుసమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజు ఉసిరి కాయను జ్యూస్ రూపంలో కాని జామ్ రూపంలో కానీ తీసుకుంటే పేగు కదలికలను క్రమబద్దం చేసి దీర్ఘకాల మలబద్దకాన్ని నియంత్రిస్తుంది. ఉసిరి, తేనె రక్తాన్ని శుభ్రపరిచేందుకు సహకరిస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది.
ఉసిరి రసం శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కంటి సమస్యలు ఉండవు. కంటిచూపు మెరుగవుతుంది.మొటిమల నివారణకు, ఫైల్స్ నివారణకు సహకరిస్తుంది.
ఉసిరి స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది. ప్రతి రోజు ఉసిరి జ్యూస్ తీసుకుంటే ఆడవారిలో, మగవారిలో సంతాన అవకాశాలు మెరుగుపడతాయి. గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఉసిరి పొడి, తేనె కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com