హెల్త్ & లైఫ్ స్టైల్

Curd: పెరుగుతో ప్రయోజనాలెన్నో.. కానీ కొన్ని ఆహార పదార్థాలతో కలిపితింటే..

Curd: పెరుగు ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అందుకే భారతీయుల ఇళ్లలో తప్పనిసరిగా భోజనం పెరుగుతో ముగుస్తుంది.

Curd: పెరుగుతో ప్రయోజనాలెన్నో.. కానీ కొన్ని ఆహార పదార్థాలతో కలిపితింటే..
X

Curd: పెరుగు ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అందుకే భారతీయుల ఇళ్లలో తప్పనిసరిగా భోజనం పెరుగుతో ముగుస్తుంది. లాక్టోబాసిల్లస్ డెల్బ్రూకీ అనే బ్యాక్టీరియా లాక్టిక్

ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాంతో పాలు పెరుగుగా మారుతుంది. పెరుగు ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ B-2, విటమిన్ B-12, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ జీర్ణవ్యవస్థ

సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కానీ పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదని చాలామందికి తెలియదు. పెరుగును కొన్ని ఆహారాలతో కలపడం ప్రమాదకరం. అది ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. చాలా మందికి ఓ అలవాటు పెరుగులో కొన్ని తరిగిన పండ్లను కలిపి తినడం. అయితే ఇది అంత మంచిది కాదని చెబుతున్నారు ఆహార నిపుణులు.

పెరుగుతో పాటుగా తినకూడని 6 ఆహారాలు..

1. ఉల్లిపాయలు

సాధారణంగా ఇళ్లలో, రెస్టారెంట్లలో పెరుగులో, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసి రైతా చేస్తుంటారు.. పెరుగు చల్లగా ఉంటుంది, ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి తోడ్పడతాయి. ఈ కలయిక దద్దుర్లు, తామర, సోరియాసిస్ వంటి చర్మసంబంధిత అలెర్జీకి కారణమవుతుంది.

2. చేప

చేపలతో పెరుగు తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే రెండు ఆహారాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే రెండు వస్తువులను జత చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.ఇది అజీర్ణం మరియు కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

3. పాలు

పాలు మరియు పెరుగు ఒకే కుటుంబానికి చెందినవి. అంటే జంతు మూలం కలిగిన ప్రోటీన్ కాబట్టి వాటిని కలిపి తినకూడదు. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలకు దారి తీస్తుంది.

4. ఉరద్ దాల్ (మినపప్పు)

పెరుగుతో మినపప్పుతో చేసిన వంటకాలు కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు ఆటంకం కలుగుతుంది.

5. ఆయిల్‌తో చేసిన వంటలు

ఆయిల్ ఫుడ్స్‌ పెరుగుతో జత చేసి తినడం వలన మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది రోజంతా మీకు బద్దకంగా అనిపిస్తుంది.

6. మామిడి

ఉల్లిపాయ, పెరుగు మాదిరిగానే, పెరుగుతో మామిడిని జత చేయడం వల్ల శరీరంలో చలి, వేడి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఇది మొత్తం శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది.

రాత్రిపూట దహిని ఎప్పుడూ తినకూడదని అంటారు ఆయుర్వేద నిపుణులు. కారణం పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కఫాన్ని తీవ్రతరం చేస్తుంది.

Next Story

RELATED STORIES