Constipation: అనేక వ్యాధులకు మూల కారణం మలబద్ధకం.. ఈ ఆహారాలతో చెక్..

Constipation: చాలా జబ్బులకు మూల కారణం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం.. సరైన వ్యాయామం, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. మలబద్ధకం తీవ్రమైన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని ప్రముఖ యూరాలజీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మలబద్దకం.. మూడు రోజుల కంటే ఎక్కువ కాలం మలం విసర్జించలేకపోవడం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం మరియు కొన్ని మందులు వంటి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. ఉదయాన్నే టాయ్‌లెట్‌కి వెళ్లకపోతే ఆ రోజంతా అసౌకర్యంగా అనిపిస్తుంది.
కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అయితే ఇది దీర్ఘకాలికంగా ఉంటే, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. సమస్య మూల కారణాలు తెలుసుకుని సహజ నివారణలను ఉపయోగించి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. మలబద్ధకం నివారణకు పోషకాహార నిపుణులు సూచించే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
మలబద్ధకం వచ్చి మలమూత్ర విసర్జన చేయలేకపోతున్నారంటే మీ శరీరం వ్యర్థాలను నిర్వీర్యం చేయలేకపోతుంది అని గమనించాలి. మలబద్ధకం వలన శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇది ప్రేగు ఆరోగ్యం మరియు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది" అని న్యూట్రీషియన్లు పేర్కొంటున్నారు.
బొప్పాయి, అంజీర్, ఆపిల్ పళ్లరసం వెనిగర్, చియా గింజలు, గోంధ్ వంటి కొన్ని సూపర్‌ఫుడ్‌లను మీ ఆహారంలో భాగం చేసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు.
* అంజీర్: ఇందులో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. "ఉదయం, రాత్రి నానబెట్టిన అంజీర్ పండ్లను తీసుకుంటే పేగు కదలికలు సులభంగా జరుగుతాయి.
* చియా గింజలు : ఈ గింజలు మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. మధ్యాహ్నం భోజన సమయంలో ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ నానబెట్టిన చియా గింజలను తీసుకోవడం అలవాటు చేసుకోండి.
* యాపిల్ : యాపిల్‌లో పెక్టిన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోజుకో యాపిల్ పండు తినడం మర్చిపోవద్దు.
* తులసి గింజలు: ఈ గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి సాధారణంగా ప్రేగు కదలికను ప్రోత్సహిస్తాయి. తులసి గింజలతో పాటు 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
* బొప్పాయి: ఇది పేగు ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. పండిన బొప్పాయి ముక్కలు ఓ కప్పు తరచుగా తీసుకుంటూ ఉండాలి.
* గోంధ్ కటిరా : "ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట నీటిలో నానబెట్టిన గోంధ్ కటిరా 1 గ్రాన్యూల్‌ను ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మోషన్ ఫ్రీ అవుతుంది.
* చిలగడదుంప: ఇది కరగని ఫైబర్‌ను కలిగి ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. సీజన్‌లో దొరికినప్పుడు తప్పక తీసుకోవాలి.
* ఎండుద్రాక్ష : ఇది ప్రేగు కదలికను సాఫీగా చేస్తుంది. ఓ 10 ఎండుద్రాక్షలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగడం అలవాటు చేసుకోవాలి. అందులోనే ఓ చిన్న పటికబెల్లం ముక్క వేస్తే నీళ్లు తాగుతూ ఎండు ద్రాక్షలను కూడా తినేయొచ్చు.
* యాపిల్ సైడర్ వెనిగర్ (ACV): ఇది ప్రోబయోటిక్‌గా అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి భోజనానికి ముందు ఒక గ్లాసు నీటిలో 1 స్పూను వేసుకుని తీసుకోవాలి.
గమనిక: మీకు తీవ్రత ఎక్కువగా ఉంటే కచ్చితంగా నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. ఈ సమాచారం వైద్యులకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు అని గుర్తించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com