వైరస్ తీవ్రతను తగ్గించే ఔషధం.. వంద శాతం రిలీఫ్

కరోనా సీజన్.. వర్షానికి తడిచి నాలుగు తుమ్ములు తుమ్మినా, డస్ట్ అలెర్జీ వల్ల హాచ్ అన్నా.. అమ్మో కరోనానేమో అని కంగారు పడవలసి వస్తోంది. కరోనా కాదు అని చెప్పడానిక్కూడా లేకుండా పోతోంది.. ఏ లక్షణాలు లేవు నిక్షేపంలా ఉన్నాం కదా అనుకున్నా టెస్ట్‌కి ఇస్తే కోవిడ్ అని రిజల్ట్ వస్తోంది.. మామూలు జబ్బుల్లా కాదే.. కరోనా వచ్చిన వాళ్ల కష్టాలు వర్ణనాతీతం.. అందరికీ దూరంగా ఉండాలి.. ఎనిమిది నెలలుగా కరోనా పేరు వినీ వినీ ఇప్పుడు కరోనాతో కలిసి బతకడం నేర్చేసుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చేలోపు ఏవో ఒక మందులు వాడుతూ ఉపశమనం పొందుతున్నారు.. కోలుకుంటున్న వారిసంఖ్య అధికంగానే ఉంటున్నా.. అక్కడక్కడా ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఎవరికి వారు ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు తీసుకుంటున్నారు.
వైద్యుల సూచన మేరకు విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకునేందుకు coronoid అనే ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు పరిశోధకులు. అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఈ ఔషధాన్నీ ఉంచారు. ఈ మెడిసిన్ అందించే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను సంస్థ ప్రతినిధులు వివరిస్తూ.. ఇది శరీరంలోని సైటోకైన్ లెవల్స్‌ని తగ్గిస్తుందని అన్నారు. అలాగే ఊపిరితిత్తుల్లోని సిలియాను సంరక్షించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. రక్తప్రసరణను మెరుగు పరచడంతో కోవిడ్ కారణంగా కోల్పోయిన శక్తిని తిరిగి అందిస్తుందని అన్నారు. ఈ ఔషధం.. ప్రాణాంతకమైన వైరస్‌లు, బ్యాక్టీరియాల గురించి పరిశోధన చేసే సంస్థ CCMB ఆమోద ముద్ర పొందడం అత్యంత సంతృప్తికరమైన విషయమని సంస్థ తెలిపింది. తాము రూపొందించిన ఔషధం coronaidకి వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్‌గా NuZen సంస్థ కొనసాగుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com