Omicron Variant home care guide: ఒంట్లో నలతగా ఉందా.. ఒమిక్రాన్ వచ్చిందేమో.. ఇంట్లోనే ఉండి ఇలా చేస్తే సరి
Omicron Variant home care guide: కొత్తగా ఉద్భవించిన ఓమిక్రాన్ వేరియంట్ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగించే అంశంగా మారాయి. వైరస్ బారిన పడడం వల్ల ఆరోగ్యం చాలా వరకు దెబ్బతింటుంది కాబట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అన్ని కోవిడ్ కేసులు తీవ్రంగా ఉండవు. కొందరికి మాత్రమే ఆస్పత్రిలో చేరే అవసరం రావచ్చు.
తేలికపాటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు హోమ్‌కేర్ ద్వారా చికిత్స చేయవచ్చని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ రోగులకు వారి ఆహారపు అలవాట్లు, లిక్విడ్ తీసుకోవడం, మందులు తీసుకోవడంతో పాటు తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా ఒమిక్రాన్ నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. ఇంట్లోనే ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు నిపుణులైన వైద్యులు.
మనం తినే ఆహారం మరియు మనం తీసుకునే పోషకాలు మన మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కోవిడ్-19 పేషెంట్లు తమ పోషకాహారం విషయంలో కొంత అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరానికి సరైన పోషకాహారాన్ని అందించకపోవడం వల్ల రోగులలో కోలుకునే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఒక్కసారే తీనలేకపోయినా కొద్ది మొత్తంలో ఎక్కుసార్లు పోషకాహారం తీసుకునే ప్రయత్నం చేయాలి.
ప్రొటీన్..
ప్రొటీన్లు శరీరానికి బిల్డింగ్ బ్లాక్‌ల వంటివి. సరైన ప్రోటీన్ తీసుకోవడం వలన ఒక వ్యక్తి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు ప్రోటీన్ లోపం ఒక కారణం. కావునా ప్రోటీన్ పదార్ధాలు తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
కొవ్వులు మన శరీక పనితీరును మెరుగుపరిచే ముఖ్యమైన పోషకం. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం వలన కోవిడ్ రోగులు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్..
యాంటీఆక్సిడెంట్లను ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ అని కూడా పిలుస్తారు. వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఆపిల్, దానిమ్మ, మామిడి, నారింజ, బొప్పాయి, కస్తూరి పుచ్చకాయ, కివీ వంటి పండ్లను తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లను పెంపొందించుకోవచ్చు.
అధిక చక్కెరను నివారించండి..
అధిక చక్కెర వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా ఇన్‌ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నీరు..
శరీర బరువును బట్టి వారు రోజుకు 2.5 లీటర్ల నుండి 4.5 లీటర్ల వరకు నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తేలికపాటి వ్యాయామం..
నిజానికి వ్యాయామం జీవనశైలిలో భాగం కావాలి. కోవిడ్-19 వైరస్ వల్ల కలిగే అనారోగ్యం కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది. భారీ వ్యాయామాలు చేయడం సాధ్యంకాదు. కొన్ని సులభమైన తేలికపాటి వ్యాయామాలు వేగంగా కోలుకోవడంలో సహాయపడతాయి.
ముఖ్యమైన ప్రాణాయామం..
శ్వాస పట్ల దృష్టిని కేంద్రీకరించే యోగా వ్యాయామం. అనులోమ్-విలోమ్ వంటి ప్రాణాయామం సాధన చేయడం వల్ల శరీరం నుండి విషపదార్థాలను తొలగించడంతో పాటు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ వ్యాయామాన్ని మొదటి వారంలో సుమారు 10 నిమిషాల పాటు రోజుకు రెండు లేదా మూడు సార్లు సాధన చేయడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బోర్లా పడుకుని ఊపిరి పీల్చుకోవడం ద్వారా ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు.
నడక
కరోనా వైరస్ అంటువ్యాధి అని ఇంట్లో వారికి దూరంగా ఓ గదిలో ఉంటారు. అదే గదిలో రోజుకు రెండుసార్లు 10 నిమిషాల పాటు నడవడం వలన ఉపయోగకరంగా ఉంటుంది.
ఇవన్నీ చేస్తూనే వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు తక్షణం వైద్యుని సంప్రదించడం చాలా అవసరం. ఆరోగ్యంతో ఆటలాడుకోవడం మంచిది కాదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com