సూపర్.. కీరాతో బరువు తగ్గొచ్చట.. 15 రోజుల్లో 7 కిలోలు

సూపర్.. కీరాతో బరువు తగ్గొచ్చట.. 15 రోజుల్లో 7 కిలోలు
అబ్బా.. ఎన్నో ట్రై చేశాం.. కానీ ఈ బరువు మాత్రం తగ్గట్లేదు అని బాధపడుతున్నారా.. ఒక్కసారి కీరా కూడా ట్రై చేయండి..

అబ్బా.. ఎన్నో ట్రై చేశాం.. కానీ ఈ బరువు మాత్రం తగ్గట్లేదు అని బాధపడుతున్నారా.. ఒక్కసారి కీరా కూడా ట్రై చేయండి.. శ్రద్ధగా చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది. దానితో పాటు మీ అనారోగ్యకరమైన అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా మార్చుకోండి.. అంటే జంక్ ఫుడ్ తినడం, లేటుగా పడుకుని లేటుగా లేవడం, నోరు ఖాళీలేకుండా ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండడం ఇలాంటివన్నీ అన్నమాట. మరి వెయిట్ తగ్గాలంటే ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. కొంచెం కష్టమే అయినా తప్పదు మరి.. మీరు మీ కోసమే కదా వర్క్ చేయాలి.

ఇంత స్లిమ్ ఎలా అయిపోయారు అని ఎవరైనా అంటే ఎంత బావుంటుంది. బరువుంటే బద్దకం, అనారోగ్యం.. అందుకే వెయిట్ లాస్ టిప్స్ కచ్చితంగా పాటిచేద్దాం అని మీకు మీరు అనుకొని మొదలు పెట్టాలి.

కీరా దోసలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జీరో క్యాలరీలతో నీరు ఎక్కువగా ఉన్న కూరగాయ అని మనందరికీ తెలుసు. దీనిని ఎక్కువగా సలాడ్‌లో ఉపయోగిస్తారు. కీరా రుచిగా ఉండటమే కాదు, చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. దీనిలోని మంచి విషయం ఏమిటంటే, ఇది తింటే కడుపులో తేలికగా ఉంటుంది, చాలా మంది ప్రజలు ఆకలి బాధలను అధిగమించడానికి తమ ఆహారంలో కీరాను చేర్చుకుంటారు.

బరువు తగ్గడానికి సులభమైన పరిష్కారం కీరా దోసకాయ.

కీరా దోసను ఆహారంంగా తీసుకుంటే 15 రోజుల్లో 7 కిలోల వరకు బరువు తగ్గడానికి మీకు సహాయం చేస్తుంది. మీ రోజువారీ ఆహారంలో కీరా తీసుకుంటే బెల్లీ ఫ్లాబ్ ను, అదనపు బరువును వేగంగా తగ్గిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, మీకు ఆకలిగా ఉన్నప్పుడల్లా, మీరు కీరా దోసను అల్పాహారంగా తీసుకోవాలని నియమం పెట్టుకోవాలి.

దోసకాయలు చాలా తక్కువ కేలరీలు మరియు తక్కువ కొవ్వు (కేవలం 0.35 గ్రాములు) ఉన్నందున వాటిని సులభంగా భర్తీ చేయవచ్చు. దీనిలో విటమిన్ ఎ, బి మరియు కె వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి, అధిక ఫోలేట్ విలువతో పాటు మీ రోజువారీ పోషకాలు తప్పిపోకుండా చూసుకుంటాయి. అలాగే, పిండి పదార్థాలు లేకుండా ఉండడం కష్టంగా భావించే వారికి ఈ డైట్ ప్లాన్ గొప్ప బరువు తగ్గించే వ్యూహం. ఒక వారం వ్యవధిలో 5 కిలోల వరకు బరువు తగ్గుతారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

దోసకాయలు బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడినా, సరైన పోషకాలు ఉండే ఆహారం, వ్యాయామం మీరు వెయిట్ ని కంట్రోల్ లో ఉంచుతుందని గుర్తుంచుకోవాలి. రెండు వారాల కంటే ఎక్కువ కాలంపాటు ఈ బరువు తగ్గించే ప్రణాళికను కొనసాగించాలనుకుంటే నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. అయితే శరీరానికి కావలసిన పోషకాలు, మినరల్స్ కూడా అందేలా చూసుకోవాలి.

గమనిక: ఏదైనా డైట్ ప్లాన్ మొదలు పెట్టేటప్పుడు వైద్యుని సంప్రదించడం అవసరం.

Tags

Read MoreRead Less
Next Story