curd mask for hair: జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోవాలంటే.. పెరుగుతో వివిధ రకాల మాస్కులు

Curd mask for Hair: ఆరోగ్యానికి పెరుగు మంచిది.. పెరుగు లేకుండా భోజనం సంపూర్తి కాదు. పెరుగులో ప్రో బయోటిక్ అధికంగా ఉంటుంది.ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాగే పెరుగు మాస్క్ జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జుట్టు పట్టుకుచ్చులా మెరిసేందుకు దోహదపడుతుంది.
చలికాలంలో చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. జుట్టు నిర్జీవంగా, పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువ. వారానికి ఒకసారి పెరుగు మీ తలకు పట్టిస్తే ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే బయోటిన్, జింక్‌తో పాటు, జుట్టును రూట్ నుండి బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి, జుట్టుకు పెరుగు జుట్టు పెరుగుదలకు గొప్ప బూస్టర్!
పెరుగుతో తయారుచేసిన ప్యాక్‌లు జుట్టు సంరక్షణలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేసి జుట్టుకు బలాన్ని మరియు మెరుపును ఇస్తాయి.
పెరుగుతో వివిధ రకాల మాస్కులు..
పెరుగు, మెంతి మాస్క్: ఈ మాస్క్ చేయడానికి, మెంతి గింజలను పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని పెరుగులో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని జుట్టు చివర్ల నుంచి అప్లై చేసి గంట తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ ప్యాక్ జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. హెయిర్ ఫోలికల్స్‌ను బలపరుస్తుంది. జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
పెరుగు, ఆలివ్ ఆయిల్ మాస్క్: ఒక కప్పు పెరుగులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేసి కొన్ని గంటల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మాస్క్‌ని వారానికి రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు, గుడ్డు మాస్క్: ఒక గిన్నెలో గుడ్డు కొట్టి ఒక చెంచాతో బాగా కలపండి. దానికి ఆరు చెంచాల పెరుగు వేసి మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత, జుట్టును శుభ్రం చేస్తే సిల్కీగా ఉంటుంది.
పెరుగు, నిమ్మకాయ మాస్క్: పెరుగులో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఈ ప్యాక్‌ను 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మాస్క్‌ని వారానికి రెండు సార్లు వేసుకుంటే చుండ్రు సమస్య పోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com