Daily Drinking Water Consumption : ప్రతిరోజూ ఎంత నీరు త్రాగాలి? నీటి వల్ల ఉపయోగాలు..

Daily Drinking Water Consumption : ప్రతిరోజూ ఎంత నీరు త్రాగాలి? నీటి వల్ల ఉపయోగాలు..
Daily Drinking Water Consumption : డీ హైడ్రేషన్ కారణంగా మీరు ఎంత అలసిపోయారో మీకు అర్థం కాకపోవచ్చు. మీ మెదడుపై దాని ప్రభావం అధికంగా ఉంటుంది.

Daily Drinking water consumption: భూమిలో 70 శాతం నీరు ఉన్నప్పటికీ, మొత్తం 70 శాతం తాగడానికి అనువైనది కాదు. తాగే నీటి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంఘటనలు చూస్తుంటాము.

శరీరంలో కూడా దాదాపు 70 శాతం నీరు ఉంటుంది. ఇది మూత్రవిసర్జన, చెమట మొదలైన వాటి ద్వారా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. నీరు కీళ్లు బిగుసు పోకుండా ఉండడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని సున్నితమైన కణజాలాలను రక్షిస్తుంది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు వైద్యులు.

నీరు శరీరానికి చాలా ముఖ్యమైనది. సరిపడినంత నీరు శరీరానికి అందకపోతే అవసరమైన పోషకాలు అందవు. శరీరం చేసే మెజారిటీ విధులు జరగవు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తీసుకుంటే, కనీస ప్రయోజనాలను మాత్రమే పొందుతారు.

చాలా మంది వైద్య నిపుణులు ప్రతి వ్యక్తి రోజుకు 2-3 లీటర్ల వినియోగాన్ని సూచిస్తున్నారు. దీని ద్వారా శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. ఇది ఎనర్జీ లెవల్స్‌ను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో తక్కువ ఎనర్జీ లెవల్స్‌ను అనుభవిస్తూ ఉండవచ్చు. ఇది మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు శరీరం అలసిపోయినట్లు, శరీరం నిస్సత్తువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

డీ హైడ్రేషన్ కారణంగా మీరు ఎంత అలసిపోయారో మీకు అర్థం కాకపోవచ్చు. మీ మెదడుపై దాని ప్రభావం అధికంగా ఉంటుంది. అన్నింటికంటే, కణాలకు సంకేతాలను పంపడానికి మెదడుకు నీరు చాలా అవసరం.

మెదడు అలసిపోయినప్పుడు, కండరాలు సమర్ధవంతంగా కదలడంలో విఫలమవుతాయి. కళ్ళు అలటకు గురవుతాయి. అలాంటి సమయంలో మెదడు ప్రాథమికంగా ముఖ్యమైన విధులను అమలు చేయడం తప్ప అదనపు శక్తిని కలిగి ఉండదు. అప్పుడు చేస్తున్న పనిపై దృష్టి పెట్టడం సాధ్యం కాదు.

ఆ సమయంలో శరీరానికి నీటి అవసరం ఉందని గుర్తించి వెంటనే ఓ గ్లాస్ నీరు తాగాలి. ఇది మీ మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది. నీరు బరువు పెరగడాన్ని కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, నీరు కూడా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. నీరు కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీ అధిక ఆకలిని అణచివేయడానికి తోడ్పడుతుంది. తద్వారా మీరు అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

నీరు చర్మానికి నిగారింపును తెస్తుంది. శరీరానికి తగినంత నీరు అందకపోతే చర్మం పొడిబారినట్లు ఉంటుంది. ముడతలు పడేలా చేస్తుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన చర్మం కోసం తగినంత నీరు త్రాగడం మంచిది.

మన మొత్తం శరీరం యొక్క సరైన పనితీరుకు నీరు చాలా ముఖ్యమైనది, కాబట్టి దాహం అనిపించినప్పుడు మాత్రమే నీరు త్రాగడం సరియైన పద్దతి కాదు. మరీ దాహంగా అనిపించినప్పుడు కాకుండా మధ్యమధ్యల్లో నీరు తాగుతుండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అవయవాల పనితీరు సక్రమంగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story