Banana Milk Shake: బనానా మిల్క్‌షేక్ తాగుతున్నారా.. ఆగండాగండి

Banana Milk Shake: మిల్క్‌షేక్.. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇష్టమైన ఫుడ్. వాతావరణం వేడిగా ఉన్న టైమ్‌లో చల్లని మిల్క్‌షేక్ తాగితే అమృతం తాగినంత ఆనందం. ఓ గ్లాస్ మిల్క్‌షేక్ తాగితే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోయినా పొట్ట నిండుగా అనిపిస్తుంది.
పాలు, అరటి పండుతో చేసే మిల్క్‌షేక్ చాలా మంది ఇష్టపడే కాంబినేషన్. అయితే అరటిపండ్లు, పాలు కలయిక వివిధ ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని అంటున్నారు న్యూట్రీషియన్ నిపుణులు.
అరటి, పాలు రెండింటిలో ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. పాలు ప్రోటీన్, పొటాషియం, బి విటమిన్, ఫాస్పరస్‌తో నిండి ఉన్నాయి. పాలు ఎముకల ఆరోగ్యానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. అలాగే అరటిలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ బి 6, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలు, అరటిపండుల కలయిక మంచిది కాదు.
డైటీషియన్, సైకాలజస్ట్ కూడా అయిన డాక్టర్ హరీష్ కుమార్ మాట్లాడుతూ.. "ఈ రెండింటి కలయిక శరీరానికి హానికరం అని అన్నారు. కాబట్టి మేము దీనిని సిఫార్సు చేయము. ఒకవేళ మీరు వాటిని తినాలనుకుంటే, మీరు మొదట పాలు తీసుకొని 20 నిమిషాల తరువాత అరటిపండు తినవచ్చు. అరటి మిల్క్‌షేక్ జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఇది మీ నిద్రను కూడా భంగం చేస్తుంది అని వివరించారు.
మీరు బరువు తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే, అరటి మిల్క్‌షేక్ అస్సలు తీసుకోకూడదు. ఈ రుచికరమైన కలయిక సాధారణంగా బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు లేదా కండర ద్రవ్యరాశిని పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు వినియోగిస్తారు.
ఉబ్బసం వంటి అలెర్జీ లక్షణాలు ఉన్నవారు అరటిపండ్లు, పాలు కలిపి తీసుకోకూడదు. ఇది శ్లేష్మ రుగ్మతలకు దారితీస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం, ప్రతి ఆహారానికి దాని స్వంత రుచి ఉంటుంది. ప్రతి ఆహార వస్తువు దాని ప్రత్యేకమైన రుచి, లక్షణాలు, శక్తి.. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. విభిన్న శక్తులతో కూడిన ఆహారం కలిపినప్పుడు, అది మన జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది అజీర్ణం, కడుపు ఉబ్బరం, టాక్సిన్స్ ఉత్పత్తికి దారితీస్తుంది.
అరటి, పాలు కలిపి తీసుకుంటే సైనస్, జలుబు, దగ్గు, అలెర్జీలకు దారితీస్తుంది. కాబట్టి అరటిపండ్లు, పాలు కలిపి తీసుకోకపోవడమే మంచిది. వాటిని విడి విడిగా తీసుకోవాలి. విడిగా తీసుకోవడం వలన అవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com