Dehydration: ఎండాకాలం కంటే చలికాలంలోనే ఎక్కువగా డీ హైడ్రేషన్ సమస్య.. ఎందుకంటే..

Dehydration (tv5news.in)
Dehydration: డీ హైడ్రేషన్ అంటే ఒక మనిషిలోని వాటర్ లెవెల్స్ తగ్గిపోతే వచ్చే ఆరోగ్య సమస్య. అయితే ఈ సమస్య ఎప్పుడైనా రావచ్చని.. చలిగా ఉండే డీ హైడ్రేట్ అవ్వమని అనుకోవడం తప్పని వైద్యులు అంటున్నారు. ఎండాకాలంలో చెమట రూపంలో మన శరీరంలోని నీరంతా ఎక్కువశాతం బయటికి వెళ్లిపోతుంది కాబట్టి అప్పుడు మాత్రం డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది అనుకోవద్దని వారు చెప్తు్న్నారు.
చలికాలంలో మన శరీరం ఎక్కువగా తేమను కోల్పోతుంది కాబట్టి డీ హైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎండాకాలంలో లాగా మనకు ఎప్పుడూ దాహం వేయదు. చలికాలంలో మనం రోజు తాగే నీటి కొలత కూడా తగ్గిపోతుంది. అందుకే డీ హైడ్రేషన్ సమస్య తలెత్తుతుందట. దాహం లేకపోవడం వల్ల చలికాలంలో తక్కువ నీరు తాగిన పర్వాలేదు అనుకోవడం తప్పని వైద్యులు అంటున్నారు. అలాంటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఒక మనిషి కనీసం రోజుకు 3.7 లీటర్ల నీటిని తాగాలి. మనిషి శరీరాన్ని బట్టి వారు తీసుకోవాల్సిన నీటి కొలత మారుతూ ఉంటుంది. కొంతమందికి యావరేజ్ కంటే ఎక్కువ నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ 3.7 లీటర్ల నీటిని తాగడం మాత్రం ప్రతీ ఒక్కరికీ మంచిది.
ఆహారంతో నీరు కూడా మనిషి బరువును పెరిగేలా చేస్తాయి. ఏ కాలంలో అయినా రోజుకు అయిదు నుండి ఆరు లీటర్ల నీటిని తాగడం చాలా మేలు. అందుకే ఫలానా సమయం కాగానే నీరు తాగాలి అన్న సూచనను పెట్టుకుంటే మంచిది. అది మిమ్మల్ని డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
కొన్ని పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పండ్లు చలికాలంలోనే చాలా దొరుకుతాయి. ఆరెంజ్, పైన్‌ఆపిల్, బ్రోకోలి వంటివి చలికాలంలో కూడా శరీరంలో వాటర్ లెవెల్‌ను మెయింటెయిన్ చేయడానికి తోడ్పడతాయి. ఊరికే నీటిని తాగడం నచ్చకపోతే సూప్స్ కూడా తయారు చేసుకొని తాగవచ్చు.
మద్యం సేవించడం వల్ల ఒక మనిషి డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే మందుకు కాస్త దూరంగా ఉండే మంచిది. దాహం అనేది డీ హైడ్రేషన్‌కు సిగ్నల్ లాంటిది. అందుకే దాహం వేసేవరకు చూడకుండా ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్‌ను పక్కన పెట్టుకుని కొంచెంకొంచెం నీరు తాగుతూ ఉంటే మంచిది. ఎండాకాలంలోనే కాదు చలికాలంలో కూడా ఇలా డీ హైడ్రేషన్‌కు పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ అని వైద్యుల సలహా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com