Dengue on Rise: పిల్లలకు డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీస్కోండి

కర్ణాటక, ఢిల్లీ, బీహార్ వంటి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో డెంగ్యూ విజృంభిస్తోంది. తమిళనాడులో 2023లో ఎనిమిది డెంగ్యూ మరణాలు, 6,000 వైరల్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని చాలా మూలల నుండి అనేక మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ ఇన్ఫెక్షన్ వృద్ధులు, చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాబట్టి వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బడికి వెళ్లే పిల్లలకు డెంగ్యూ రాకుండా చూసుకోవడానికి, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ చిన్నారులు డెంగ్యూ నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
డెంగ్యూ నుండి పిల్లలను రక్షించే మార్గాలు
లక్షణాలను గుర్తించండి
మొదటి దశ ఏమిటంటే, మీరు, మీ పిల్లలు కూడా డెంగ్యూ లక్షణాలేంటో ముందుగా తెలుసుకోవాలి. డెంగ్యూ ప్రారంభ లక్షణాలు అధిక జ్వరం, వాంతులు, కళ్ల వెనుక నొప్పి, బలహీనత, చర్మంపై ఎర్రటి దద్దుర్లు. మీ పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
దోమలకు క్రీమ్
పిల్లలను బడికి పంపే ముందు మంచి దోమల నివారణ క్రీమ్ రాయండి. పిల్లల బ్యాగుల్లో కూడా ఈ క్రీమ్‌ను పంపండి. పెద్ద పిల్లలు ఈ క్రీమ్ను స్వయంగా అప్లై చేసుకోవచ్చు. పిల్లల సౌలభ్యం కోసం, మీరు వారికి రోల్-ఆన్ లేదా స్ప్రే రిపెల్లెంట్లను ఇవ్వవచ్చు.
ఇంటి లోపల ఉండమనండి
పిల్లలు ఆడుకోవడానికి పచ్చిక పొలాలకు వెళ్లడం అలవాటు. స్కూల్లో ఎక్కడ ఆడుకోవాలో, ఎక్కడ ఆడకూడదో చెప్పండి. నీరు నిలువలేని ప్రదేశాలు, గడ్డి మొదలైన వాటికి దూరంగా ఉండమని పిల్లలను చెప్పండి. ఈ ప్రదేశాలలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి.
ఆహారంలో మార్పులు
పిల్లల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను వారి ఆహారంలో చేర్చండి. పెరుగు, పసుపు, అల్లం, వెల్లుల్లి, బచ్చలికూర, బాదం, సిట్రస్ పండ్లు మొదలైన వాటిని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
నిండైన బట్టలు
పిల్లలకు ఆఫ్ స్లీవ్ బట్టలు వేసే బదులు ఫుల్ స్లీవ్ డ్రస్సులు వేసి స్కూల్ కి పంపండి. స్కర్ట్ కింద మేజోళ్ళు లేదా పైజామా ధరించవచ్చు. మెడ, చేతులు, కాళ్లు ఎక్కడ దోమ కుట్టిన ఆనవాళ్లు బయటపడినా దోమల నివారణ మందు వేయండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com