హెల్త్ & లైఫ్ స్టైల్

Health : డెస్క్ జాబ్ చేస్తున్నారా.. ఐతే ఈ వ్యాయామాలు మీకోసమే..

Health : ఈ 5 వ్యాయామాలు చేస్తే మీ మీ డెస్క్ జాబ్‌ హ్యాపీగా సాగుతుంది.

Health : డెస్క్ జాబ్ చేస్తున్నారా.. ఐతే ఈ వ్యాయామాలు మీకోసమే..
X

Health : డెస్క్ జాబ్ అంటే కదలకుండా ఒకే పొజషన్‌లో కనీసం 8 నుంచి 9 గంటలు కూర్చోవాలి. డెస్క్ జాబ్ చేసే వారికి మదట్లో ఎలాంటి సమస్యలు రాకున్నా.. ఆ తరువాత క్రమంగా కాళ్ల నొప్పులు, నడుపు నొప్పి, పొట్ట పెరగడం, మెడనొప్పులు వస్తాయి. డాక్టర్ సలహామేరకు కొన్ని మందులను వాడడం స్టార్ట్ చేస్తారు. కొంత ఉపశమనంగా ఉన్నా మళ్లా సమస్య మొదటికి వస్తుంది. గంటలకొద్దీ కుర్చీలోనే కూర్చొని పనిచేసే వారు రోజు కొంత వ్యాయామం చేస్తే.. ఎలాంటి నొప్పులు లేకుండా సంతోషంగా మీ డెస్క్ జాబ్ చేసుకోవగలుగుతారు.

ఈ 5 వ్యాయామాలు చేయడం మొదలుపెట్టండి

వాకింక్ : రోజు కనీసం 15 నిమిషాలు వాకింగ్ చేయండి. దీని వల్ల మీ కాలి నరాలు పట్టుకోకుండా ఉంటుంది. బాడీలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. కాళ్లల్లో శక్తికూడా పెరుగుతుంది.

ప్లాంక్స్ : అన్ని వ్యాయామాల్లో ఈ ప్లాంక్స్ చేయడం చాలా ఈజీ. ఇది చేయడానికి సింపుల్‌గా ఉన్నా.. ఫలితం అద్భుతంగా ఉంటుంది. బోర్లా పడుకొని మీ శరీరబరువుని మీ మోచేతి, కాళ్ల మడపలపై ఉంచాలి. ఇలా 1 నిమిషం చేస్తే మీ బాడీలో అనుహ్య మార్పులు వస్తాయి. రోజుకు 1 నిమిషం ప్లాంక్స్‌ను 4 సెట్లు చేస్తే.. వారంలో అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు.

స్ట్రెచ్చింగ్ : కేవలం 5 నిమిషాలు మీ బాడీని స్ట్రెచ్ చేయండి. కాళ్లు, చేతులను స్ట్రెచ్ చేయండి. నిటారుగా నలబడి మోకాళ్లను వంచకుండా చేతితో మీ కాలిబొటనవేలిని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మీ కళ్లు స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్చింగ్ వల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా మెరుగుపడుతుంది.

స్క్వాట్స్ : స్క్వాట్స్.. మీ కాళ్లు, నడుము కండరాలను బలంగా చేస్తుంది. రోజంగా కూర్చోవడం వల్ల కాళ్ల నరాలు పట్టేసి ఉంటాయి. రక్త ప్రసరణ కూడా సరిగా జరిగి ఉండదు. ఈ స్క్వాట్స్ చేయడం వల్ల మీ కాళ్లు, నడుము ఆరోగ్యంగా బలంగా తయారవుతుంది. కాళ్ల మధ్యలో రెండు ఫీట్ల దూరం ఉంచి నిలబడాలి. 8 ఇంచుల వరకు కూర్చొని 1 సెకండ్ ఆపి.. లేచి మళ్లీ అలాగే కూర్చోవాలి. ఇలా రోజుకు 30 స్వాట్స్ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

యోగాసనాలు : రక్తప్రసరణ కోసం కండరాలు బలం కావడం కోసం యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామా, బలాసనా లాంటివి చేయడం వల్ల మీ బాడీలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ప్రతీ రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల బాడీకి మంచి స్ట్రెచ్చింగ్‌ అవుతుంది.

Next Story

RELATED STORIES