Vasireddy Amarnath: కరోనా గురించి భయం వద్దు.. పూర్తిగా తగ్గిపోయింది: వాసిరెడ్డి అమర్నాథ్

Vasireddy Amarnath: కరోనా గురించి భయం వద్దు.. పూర్తిగా తగ్గిపోయింది: వాసిరెడ్డి అమర్నాథ్
Vasireddy Amarnath: పాండెమిక్ ప్రారంభం నుంచి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ విలన్ పాత్ర పోషిస్తోంది. అసలు కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఇదే కారణం.

Vasireddy Amarnath: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎండెమిక్ అయిపోయింది. కరోనా వల్ల ఇక మరణాలు జరిగే అవకాశం బాగా తక్కువ. ప్రపంచ జనాభాలో అత్యధికులు కరోనా తో ఇన్ఫెక్ట్ అయ్యారు. కొత్త వేరియెంట్ లు రావడం పోవడం సహజం. వందేళ్ల క్రితం స్పానిష్ కలుగ చేసిన ఇన్ఫ్లుఎంజా వైరస్ ఈ వందేళ్లల్లో ఎన్ని లక్షల సార్లు మ్యుటేట్ అయివుంటుందో ఆలోచించండి. ఎన్ని కొత్త రకాలు వచ్చినా, దాని వల్ల సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇమ్మ్యూనిటి కనీస స్థాయిలో ఉండేలా మంచి ఆహారం తినడం, సరైన జీవన విధానం ఉండేలా చూసుకొంటే చాలు.

ఇక పై మాస్క్ లు అక్కరలేదు . వాక్సిన్ లు అవసరం లేదు. ఆఫ్రికా లో కనీసం ఇరవైనా అయిదు శాతం జనాభా కూడా వాక్సిన్ వేసుకోలేదు. అయినా అక్కడ కరోనా మరణాలు బహు స్వల్పం. పాండెమిక్ ప్రారంభం నుంచి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ విలన్ పాత్ర పోషిస్తోంది. అసలు కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఇదే కారణం.

కరోనా విసరిస్తున్న నేపథ్యం లో డి విటమిన్ తీసుకోవడం, భయం లేకుండా ఉండడం, సరైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలను చెప్పకుండా కరోనా వస్తే ఛస్తారు" అని విపరీతంగా ప్రచారం చేసి జనాల్లో భయందోళనలు పెంచింది. దీని వల్ల మరణాలు అనేక రెట్లు పెరిగాయి.

ప్రపంచ వ్యాప్తంగా మీడియా కూడా పాండెమిక్ సమయంలో విలన్ పాత్ర పోషించింది. మీడియా ను కొన్ని అంతర్జాతీయ శక్తులు కంట్రోల్ చేసాయి. కరోనా వల్ల మరణాలు జరిగితే దాన్ని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసారు. ఇప్పుడు వాక్సిన్ వల్ల లక్షల మంది సతమత మవుతున్నారు.

మొన్నటికి మొన్న స్విట్జర్లాండ్ లో వాక్సిన్ వల్ల మరణించిన పిల్లల శవపేటికలతో తల్లితండ్రులు నిరసన ప్రదర్శన జరిపారు. ఇలాంటి వార్తలను వెలుగులోకి రాకుండా తోక్కేస్తున్నారు. మన చుట్టూరా లక్షల మంది వాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తో సతమతమవుతున్నారు.

కరోనా పాండమిక్ దశ లో వున్నప్పుడు వాక్సిన్ అంటే అర్థం వుంది. ఇప్పుడు ఎండెమిక్ దశ కు వచ్చేసి నప్పుడు కూడా అందునా దేశం లో తొంబై శాతానికి కరోనా సోకి టి సెల్స్ రక్షణ వచ్చినప్పుడు కూడా వాక్సిన్ వేసుకోడం అనేది సైన్స్ సూత్రాలకు పూర్తి విరుద్ధం. అయినా వాక్సిన్ మార్కెటింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. మూడో డోసు తీసుకొన్న అనేక హెల్త్ వర్కర్స్ గుండెపోటు తో మరణిస్తున్నారు. అయినా ఇవేవి పట్టనట్టు, అసలు ఇది నిజం కాదని, రుజువులు లేవని దబాయిస్తూ మార్కెటింగ్ చేసుకొంటున్నారు. జనాలు అమాయకంగా నమ్ముతున్నారు.

మీజిల్స్‌కి సంబంధించిన వ్యాక్సిన్‌లు పూర్తి స్థాయి ప్రయోగాల తరువాత వచ్చాయి. కానీ కరోనా వాక్సిన్ లు అత్యవసర వినియోగానికి మాత్రం అనుమతి పొందాయి. వాటిని తయారు చేసిన కంపెనీ లే వాటి గురించి గ్యారెంటీ ఇవ్వడం లేదు. నష్టపరిహారం ఇవ్వరు. కాబట్టి గుడ్డిగా కరోనా వాక్సిన్ ను మిగతా వాక్సిన్ ల తో పోల్చవద్దు.

వాక్సిన్ వేసుకొంటే ఒళ్ళు గుల్ల అవుతుంది. ఒకటో డోసు వేసుకొన్న వారికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు . రెండో డోసు వేసుకొన్న వారికి అందులో ముఖ్యంగా ఒక బ్రాండ్ వేసుకొన్న వారికి విపరీత సైడ్ ఎఫెక్ట్స్ వున్నాయి . బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా. కనీసం రెండు వేల మందిని ఒక స్టేజి పైకి తెస్తా. వారు చెప్పేది కాదు. వారికి వాక్సిన్ వల్లే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని వారు ట్రీట్మెంట్ పొందుతున్న ఆసుపత్రులు చెప్పాయి . కాదని రుజువు చెయ్యండి .

రెండు డోసులకే లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. ఇక మూడవది వేసుకొంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఆఫ్రికా ఖండానికి మిగతా జనాభా కు వాక్సిన్ ను బలవంతంగా వేయించే కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీకారం చుట్టింది. దీని వల్ల దారుణ పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం.

ఒక మంత్రి గారి శ్రీమతికి వాక్సిన్ వల్ల చర్మం నల్లబడింది. ఇది వారు చెబుతున్న మాటే . మరో మంత్రి గారు వాక్సిన్ వేసుకోవాలని పిలుపు నిస్తారు . కనీసం మూడు చానెల్స్ లో న్యూస్ రీడర్ లు పని చేస్తున్న మహిళలు తమకు వాక్సిన్ వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నాకు చెప్పారు . తమకే కాదు తమ సర్కిల్ లో పెద్ద ఎత్తున మహిళలు సైడ్ ఎఫెక్ట్స్ బాధ పడుతున్నారు అని వారు చెప్పారు . కానీ ఇవేవి పబ్లిక్ వార్తలు కావు . ప్రింట్ లో వచ్చిన దాన్ని గుడ్డిగా నమ్మడం , నా లాంటోడు " అయ్యో జనాలు ఇన్ని బాధల్లో వున్నారు " అని నిజాలు చెబితే " నీ మొఖం నీకేమి తెలుసు ?" అని దబాయించడం అలవాటు అయిపొయింది .

అమాయకత్వం అనండి.. మరొకటి అనండి .. జనాలు కోరి కోరి జీవితాల్ని నాశనం చేసుకొంటున్నారు.

1.వేసుకొన్న వాక్సిన్ లు చాలు .. ఇక అక్కడి తో ఆపేయండి . వాక్సిన్ వేసుకోక పొతే పిల్లలని పరీక్షలు రాయనివ్వం లాంటి ఉత్తుత్తి దబాయింపులకు భయపడవద్దు . వాక్సిన్ స్వచ్చందం అని కేంద్ర ప్రభుత్వం కోర్ట్ కు చెప్పింది . బలవంత పెట్టి వాక్సిన్ వేయించడం నేరం . భయపడొద్దు . మీకు మీ ప్రాణాలు , మీ పిల్లల ప్రాణాలు ముఖ్యం . అవునా? కాదా ?

2 . మాస్క్ లు, భౌతిక దూరం , పదేపదే చేతులు కడగడం ఇక అవసరం లేదు.

3. పిల్లలని ఇక నైనా స్కూల్ కు పంపండి . అది ప్రుభుత్వ స్కూలా లేక చైనా కోళ్ల ఫారం నా మరొకటా అనేది వేరే విషయం . అది మీ ఇష్టం . చదువంటే కేవలం పాఠాలు , సిలబస్ కాదు . మార్కులు రాంక్ లు కాదు . బడికి వెళ్ళినప్పుడు మిగతా పిల్లలతో కలిసి వ్యవహరించడం ద్వారా పిల్లల సోషల్, ఎమోషనల్ ఇంటలిజెన్స్ డెవలప్ అవుతుంది . ఇది లేక పొతే వారు అడవి మనుషులతో సమానం .. భవిషత్తు అంధకారం అయిపోతుంది . రెండేళ్ల ఆన్లైన్ క్లాసులు చాలు . ఇంకా ఆన్లైన్ సాగిస్తే భర్తీ చేయలేని నష్టం.

4 . సాఫ్ట్ వెర్ కంపెనీ లు , వర్క్ ఫ్రం హోమ్ లాభాలకు అలవాటు పడ్డాయి . ఎన్ని చెప్పినా వారు మారరు. వారి పై ఆధారపడి క్యాబ్ లు కొనుకున్న వారు హోటల్స్ పెట్టుకొన్న వారు హాకర్ లు సర్వనాశనం అయ్యారు . ప్రభుత్వాలు ఇంకా వర్క్ ఫ్రం హోమ్ సాగిస్తున్న కంపెనీ ల పై ప్రత్యేక పన్ను విధించి ఆ మొత్తాన్ని నష్ట పోయిన క్యాబ్ డ్రైవర్ లాంటి వారి కి ఇవ్వాలి .

5 . అదిగో కొత్త వేరియెంట్ ఇదిగో కొత్త వేరియెంట్ అనే వార్తలను ఓపెన్ చేయెద్దు . ముఖ్యంగా షేర్ చేయెద్దు ." కొత్త వైరస్ వచ్చేస్తోంది .. ప్రతి ముగ్గురిలో ఒకరు చస్తారు" అని అందర్నీ ఒక రోజు ఎలా ఫూల్ చేసారో చూసారు కదా . ఇది తప్పుడు సమాచార యుగం . తప్పుడు సమాచారం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి . దేన్నీ గుడ్డిగా నమ్మొద్దు .

6.విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి హ్యాపీగా జీవించండి . పిల్లాపాపలతో ఆడుకోండి. మంచి సంగీతం వినండి . ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి . పిండి పదార్థాలు తగ్గించండి . ఉప్పు మితంగా వాడండి . మంచి నీరు బాగా తాగండి . ఎండ లో నడవండి . మీ బడ్జెట్ బట్టి పార్క్ ల కో ఊటీ కో వెళ్ళండి . వాల్నుట్స్ తీసుకోండి . ఆకు కూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోండి . షుగర్ లేని వారు పళ్ళు తీసుకోండి .

7 . మన దేశం లో ఎన్నికల సీజన్ వచ్చేసింది . రాజకీయ నాయకులు మీకు అర్థం కానీ ట్రిక్కులు , టక్కుటమరాలు ప్రయోగిస్తున్నారు . మీరు ఏ పార్టీ , ఏ నాయకుడి అభిమాని అయినా ఫరవాలేదు. రేపు వారికే ఓటు వెయ్యండి . తప్పు లేదు . కానీ వారి కోసం సోషల్ మీడియా లో సిగపట్లు వద్దు . మీ అభిమాన నాయకుడు ఏదో అమాయకుడని మిగతా వారు విల్లన్ లు అని తెగ బాధపడొద్దు . ఎమోషనల్ కావొద్దు . వారి సంగతి వారు చూసుకొంటారు . మీ కోసం , మీ పిల్లల కోసం ఏడవండి .. ఏడవడం అంటే ఆలోచించండి . అంతే కానీ రాజకీయ నాయకుల కోసం కాదు .. మీరు ఎక్కువ ఎమోషన్ అయితే అసలే వాక్సిన్ వేసుకొన్న మీ గుండె కు అంత మంచిది కాదు . అర్థం చేసుకోండి .

ఒక యజ్ఞం ముగిసింది. నా ప్రయత్నం లో ఎవరినైనా నొప్పించి ఉంటే సారీ .. సత్యాన్ని నమ్ముకోండి . దానిదే చివరి గెలుపు .

సర్వే జనా సుఖినోభవంతు. అందరూ బాగుండాలి .. అందులో తప్పక నేనుంటాను.

నమస్కారం.

-వాసిరెడ్డి అమర్నాథ్



Tags

Read MoreRead Less
Next Story