Dogs Marriage : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి

Dogs Marriage : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి
హిందూ సాంప్రదాయ పద్దతిలో శునకాలకు వివాహం

బాజా భజంత్రీలు, ఎదుర్కోళ్లు, బందువుల సందడి మధ్య కుక్కల పెళ్లి జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసాధారణంగా ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. శునకాలు పెళ్లి చేసుకున్న వీడియోను చూసిన నెటిజన్లు విస్మయానికి గురయ్యారు. పెళ్లి వేడుకలో అతిథులు సరదాగా గడుపుతుండగా హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహం జరిపించారు. నృత్యం చేస్తూ మగ శునకాన్ని ఎదురెళ్లి స్వాగతం పలికారు. వివాహ మండపం వరకు నృత్యం చేస్తూ మగ శునకాన్ని తీసుకొచ్చారు.

ఆడ శునకానికి వధువు వలె ఎర్రటి దుపట్టా చుట్టబడి ఉంది. వరుడు శునకం ఎలక్ట్రిక్ బొమ్మ కారులో వివాహ వేదిక వరకు వచ్చింది. వేదిక వద్ద రెండు కుక్కలకు దండలు మార్చారు. ఈ వీడియో రెండు రోజుల క్రితం విడుదల అయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆహ్వనం అందనందుకు బాధగా ఉందని కొందరంటున్నారు. ఇది చూశాక నేను నా పిల్లులకు పెళ్లి జరిపిస్తానని ఓ వ్యక్తి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story