Donkey Milk: గాడిద పాలు లీటర్ రూ.10,000.. అంత డిమాండ్ ఎందుకంటే..

Donkey Milk: గాడిద పాలు లీటర్ రూ.10,000.. అంత డిమాండ్ ఎందుకంటే..
Donkey Milk: ఉదయం లేస్తే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్ధాలు ఏంటా అని సామాజిక మాధ్యమాల్లో సెర్చింగులు.. నలుగురు కలిస్తే అదే టాపిక్.

Donkey Milk: ఇంతకు ముందు ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి వంటి పదాలు పెద్దగా ఎవరికీ తెలియపోయినా కరోనా పుణ్యమా అని అందరి నోట అదే మాట. ఉదయం లేస్తే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్ధాలు ఏంటా అని సామాజిక మాధ్యమాల్లో సెర్చింగులు.. నలుగురు కలిస్తే అదే టాపిక్. ఈ క్రమంలో గాడిదపాలల్లో ఇమ్యూనిటీ శక్తి అధికంగా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో గాడిదపాల వ్యాపారం జోరుగా సాగుతోంది.

కరోనా వంటి ఇన్ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ పాలు ప్రభావవంతంగా పనిచేస్తాయనే నమ్మకం జనంలో అధికంగా ఉంది. ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు గాడిదపాల వ్యాపారస్తులు.. లీటరుకు గరిష్టంగా రూ.10,000లు చెల్లించేందుకు కూడా వెనుకాడ్డం లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో భారీ స్థాయిలో గాడిదపాల వ్యాపారం జరుగుతోంది.

గాడిదను వీధుల్లో తిప్పుతూ అడిగిన వారికి వారి కళ్లముందే పాలు పితికి ఇస్తారు.. ఒక్క స్పూన్ పాలు తాగిత కూడా అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని అంటున్నారు హింగోలీ వాసులు. గాడిదపాలల్లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని, చిన్నారులను వేధించే న్యూమోనియా వంటి సమస్యలను దూరం చేస్తుందని గాడిదపాల విక్రయదారులు పేర్కొంటున్నారు.

దగ్గు, జలుబు,జ్వరం వంటి వ్యాధులతో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని వివరిస్తున్నారు. అందుకే ఒక స్పూన్ గాడిద పాలు కావాలంటే రూ.100లు వెచ్చించాల్సిందే.. అదే లీటర్ పాలయితే రూ.10,000 అంటూ ప్రచారం చేస్తున్నారు. పుట్టిన బిడ్డకు 3 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. దీంతో గాడిదపాల కోసం జనం క్యూ కడుతున్నారు.

అయితే ఇదంతా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు వైద్యులు. గాడిదపాలు తాగితే కరోనా లాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవనే వదంతులకు మోసపోవద్దని డాక్టర్ వీఎన్ రోడ్జ్ చెబుతున్నారు. వైద్యుని సలహా మేరకు నడుచుకోవాలి. ఆయన సూచించిన మందులు వాడుతూ, ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.

Tags

Read MoreRead Less
Next Story