హెల్త్ & లైఫ్ స్టైల్

Weight Loss : బరువు తగ్గాలంటే ఇలా చేయండి..

Weight Loss : బరువు తగ్గాలంటే ఈ టిప్స్ ను పాటించండి

Weight Loss : బరువు తగ్గాలంటే ఇలా చేయండి..
X

Weight Loss : బరువు పెరగడం సులభం.. కానీ తగ్గాలంటే చాలా కష్టం. బరువును తగ్గించుకోవడానికి కొంతమంది లక్షలు వేలు ఖర్చుచేయడానికి కూడా వెనుకాడరు. అయితే ఇవ్వన్నీ ఖర్చులు లేకుండా కేవలం మీ ఆహార పద్ధతులను మార్చుకుంటే మీరు తక్కువ సమయంలోనే బరువు తగ్గుతారు.

గుడ్డు

బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డుతీసుకోవడం చాలా మంచిది. గుడ్డులో కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో పోషకాలు ఖనిజాలు ఉండడంతో ప్రతీరోజు ఒక గుడ్డును తినండి.

గ్రీన్ టీ

గ్రీన్‌టీలో ఎపిగాల్లోకాటెచిన గాలేట్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బాడీలో కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుందని అంటున్నారు. అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినిక్‌లో దీని గురుంచి ప్రస్తావించారు.

కారం

కారంలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిలో ఉండే క్యాప్సైసిన్.. తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇలా బరువును తగ్గించుకోవచ్చని అంటున్నారు.

ఆలివ్ ఆయిల్

శరీరానికి అవసరమైన హెచ్డీఎల్ కొలిస్ట్రాల్‌ను ఆలివ్ ఆయిల్ పెంచుతుంది. బాడీలో ఉండే జీఎల్‌పీ 1 ను ప్రేరేపిస్తుంది. ఇది ఆకలి కాకుండా ఉంచడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తినలేము. పరోక్షంగా బరువు తగ్గిపోతుంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES