Eight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది జీవనశైలి చిట్కాలు..

Eight lifestyle tips: ఎంత ఎండకైనా తట్టుకోవచ్చు కానీ .. ఈ వర్షాలు నా వల్ల కాదు బాబోయ్ అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.. పైగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు మనుషుల్ని మరింత ఇబ్బంది పెడతాయి. చిన్న పిల్లలు ఉన్న ఇల్లైతే చెప్పక్కర్లేదు. బయట వర్షం ఇంట్లో తేమ.. దగ్గులు, జలుబులు, జ్వరాలు.. ఈ సీజన్‌లో బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, డయేరియా, పొట్టలో పుండ్లు, జలుబు, ఫ్లూ వంటి అనేక ఇతర అనారోగ్యాలు వేధిస్తుంటాయి.
చిరుజల్లుల రాక మండే వేసవి నుండి ఉపశమనం పొందే ఆనందాన్ని ఇస్తాయేమో కానీ, ఎడతెరిపి లేని వర్షాలు మాత్రం చిరాకు తెప్పిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలం ఇట్టే గడిచిపోతుంది. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కొంత వరకు సీజనల్ వ్యాధులను నివారించవచ్చు. కొన్ని చిట్కాలు ఉన్నాయి:
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పరిగణించబడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ఎర్ర మిరియాలు, బొప్పాయి, నిమ్మకాయలు, టొమాటో, బెర్రీలు వంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
బయట తినడం మానుకోండి: బయట జోరున వర్షం.. ఇంట్లో వేడిగా వండిన భోజనం. దీనికి మించినది మరేదీ ఉండదు. రోడ్‌సైడ్ సెవ్ పూరీ లేదా పానీ పూరీ తినాలని ఉత్సాహంగా అనిపించినప్పటికీ, అవి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తాయి. ఈ సీజన్‌లో బయటి ఆహారపదార్ధాలు ప్రేగు సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇంట్లోనే ఆసక్తికర భోజనం లేదా స్నాక్స్ తయారు చేసుకుని తినవచ్చు.
ఆహారాన్ని సరిగ్గా ఉడికించాలి: మనం మార్కెట్ నుండి కొనుగోలు చేసే ఉత్పత్తులు సరిగా ఉడక్కపోతే బ్యాక్టీరియా సులభంగా చేరుతుంది.
మీ ఆహారంలో మసాలా దినుసులు చేర్చండి: పసుపు, మిరియాలు, అల్లం మరియు వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి.ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం, రాత్రి పడుకునే ముందు వేడి పాలలో పసుపు వేసుకుని తాగడం వంటివి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా నిరోధిస్తాయి.
ప్రోబయోటిక్స్ లేదా పులియబెట్టిన ఆహారం: ప్రోబయోటిక్స్‌లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును అదుపులో ఉంచుతుంది. ఇది పోషకాల శోషణకు మద్దతు ఇస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రోబయోటిక్స్ ఎక్కువగా పుల్లని పెరుగు, మజ్జిగ వంటి వాటిలో ఉంటాయి.
నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్: జంక్ ఫుడ్స్ తినడానికి బదులు ఖర్జూరం, బాదం, వాల్ నట్స్ గింజలు తినండి. వాటిలో రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ ఇ, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
గోరువెచ్చని నీరు త్రాగండి: ఈ కాలంలో శుభ్రమైన గోరు వెచ్చని నీటిని మాత్రమే త్రాగాలి.
మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి: సీజన్ ఏదయినా హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com