ENDOMETRIOSIS: ఆ నొప్పిని అలా వదిలేయకండి..

ENDOMETRIOSIS: ఆ నొప్పిని అలా వదిలేయకండి..
ఎండోమెట్రియోసిస్‌పై నిర్లక్ష్యం వద్దు. వృత్తిగత, వ్యక్తిగత జీవితాలపై ప్రభావితం

నెల నెలా నొప్పి. నెలసరికి ముందూ, తర్వాతా నొప్పి. మూత్ర, మల విసర్జన చేస్తున్నప్పుడూ అదే బాధ. పొత్తికడుపంతా పచ్చిపుండుగా మారినట్టు బతుకంతా నరక యాతన. కొందరు మహిళలను ఎండోమెట్రియోసిస్‌ ఇలాగే వేధిస్తుంది. ఇది ప్రతి 10 మంది మహిళల్లో ఒకరిని బాధిస్తున్నా దీని నిర్ధారణ సగటున ఏడున్నరేళ్లు ఆలస్యమవుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ విమీ బింద్రా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం అవగాహన లేకపోవటమేనని.... త్వరగా గుర్తిస్తే తాత్కాలికంగానైనా బాధలు, ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆయన సూచిస్తున్నారు.

మహిళల వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తిపరమైన అంశాలను కూడా ఎండోమెట్రియోసి ప్రభావితం చేస్తోందని డాక్టర్‌ విమీ బింద్రా తెలిపారు. ఎండోమెట్రియోసిస్ ఎలా వస్తుందనేది స్పష్టంగా చెప్పలేమని వివరించారు. దీనిని మహిళలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన విమీ బింద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోమెట్రియోసిస్ కారణంగా 40% మంది మహిళలు తమ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కోల్పోతున్నారని, 20% మంది స్త్రీలను ఉద్యోగాల నుంచి తొలగించారని ఓ అధ్యయనం తెలిపిందని విమీ బింద్రా తెలిపారు. ఎండోమెట్రియోసిస్ వల్ల పని చేసే సామర్థ్యం 66% నుంచి 75% వరకు తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఎండోమెట్రియోసిస్ మహిళల కెరీర్‌ను అంతం చేస్తుందని హెచ్చరించిన విమీ బింద్రా... జీవనశైలికి, విద్యకు కూడా ఆటంకం కలిగిస్తుందని ఎండోమెట్రియోసిస్ ఎక్సిషన్ సర్జరీ స్పెషలిస్ట్, ఎండోక్రూసేడర్స్ అండ్‌ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు అయిన డాక్టర్ విమీ బింద్రా తెలిపారు. ఎండోమెట్రియోసిస్ భారత్‌లో 25 మిలియన్ల మందికిపైగా మహిళలు, బాలికల జీవితాలను ప్రభావితం చేస్తోందని వెల్లడించారు. ఎండోమెట్రియోసిస్‌కు ప్రస్తుతం చికిత్స లేకపోయినా.. ముందే గుర్తిస్తే సాధారణ లక్షణాలను నియంత్రించవచ్చని తెలిపారు. ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న స్త్రీలు మలవిసర్జన, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, నడుము నొప్పి, క్రమరహిత రక్తస్రావం, మలబద్ధకం, విరేచనాలు, సంతానోత్పత్తి లేకపోవడం, అలసటతో బాధ పడుతుంటారని విమీ బింద్రా తెలిపారు.

తరచుగా అనారోగ్య సెలవులు, పని ఉత్పాదకత తగ్గడం వల్ల బాధిత స్త్రీలు ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమీ బింద్రా వెల్లడించారు. అత్యంత సాధారణ ఎండోమెట్రియోసిస్ లక్షణాలను ముందే గుర్తిస్తే వీటన్నింటినీ నివారించవచ్చని తెలిపారు. అందువల్ల ఎండోమెట్రియోసిస్‌పై మెరుగైన అవగాహన అవసరమని వెల్లడించారు. వైద్య నిపుణుల ద్వారా మాత్రమే కాకుండా, సమాజం, రాజకీయాలలో కూడా వ్యాధి యొక్క ప్రతికూల పరిణామాలను తగ్గించడానికి బాధిత మహిళలు కుటుంబాలకు సహాయపడుతుందని డాక్టర్ విమీ బింద్రా చెప్పారు

Tags

Next Story