ఆవలింతలు ఎక్కువగా వస్తుంటే గుండెకు..

ఆవలింతలు ఎక్కువగా వస్తుంటే గుండెకు..
నిద్ర వచ్చే ముందు ఆవలింతలు రావడం సహజం.. అలా రావడం ముంచుకొస్తున్న నిద్రకు సంకేతం.. మరి నిద్ర తాలూకు సంకేతాలేవీ లేకుండానే ఆవలింతలు వస్తే

నిద్ర వచ్చే ముందు ఆవలింతలు రావడం సహజం.. అలా రావడం ముంచుకొస్తున్న నిద్రకు సంకేతం.. మరి నిద్ర తాలూకు సంకేతాలేవీ లేకుండానే ఆవలింతలు వస్తే ఆలోచించాల్సిందే అంటున్నారు హార్ట్ స్పెషలిస్టులు.

గుండెపోటు కొన్ని నిమిషాల్లోనే మనిషిని నిలువునా కూల్చేస్తుంది. అప్పటి వరకు మనతో మాట్లాడుతున్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఒక్కోసారి వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స వంటివి జరిగి ఆయుష్షు పెరుగుతుంది. కొన్ని లక్షణాలు గుండెపోటుకు సంకేతాలు. వాటిని అశ్రద్ధ చేయక డాక్టరుకు చూపించుకోవడం తక్షణ కర్తవ్యం. గుండెపోటు వచ్చినప్పుడు గుండెకు రక్త ప్రవాహం నిరోధించబడుతుంది. ఇది ఆక్సిజన్ రవాణాలో అంతరాయం కలిగిస్తుంది.

దీంతో గుండె కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఏమాత్రం గుండెపోటు సంకేతాలు కనిపించినా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ శ్రద్ధ వహిస్తే పరిస్థితి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. అయితే కొన్ని సంకేతాలు మనల్ని అనుమానానికి గురిచేస్తాయి. అందులో ఒకటి మితిమీరిన ఆవలింతలు.

ఆవలింత వైద్య ప్రపంచంలో ఒక రహస్యం. దీనిని డీకోడ్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ శాస్త్రవేత్తలు పెద్దగా విజయం సాధించలేదు. కొన్ని అధ్యయనాల ప్రకారం మెదడును శీతలీకరించడానికి ఆవలింత సహాయపడుతుంది అని తెలుసుకున్నారు.

మితిమీరిన ఆవలింత అనేది వాగస్ నాడికి సంబంధించినది గుండె వైద్యులు చెబుతారు. ఇది మెదడు దిగువ నుండి గుండె నుంచి ఉదర భాగం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, గుండె చుట్టూ రక్తస్రావం అధికంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువగా ఆవలిస్తారు. ఇది గుండెనొప్పికి సంకేతంగా అనుకోవచ్చు.

కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువగా ఆవలింతలు స్ట్రోక్‌కి ముందు లేదా తరువాత జరగవచ్చు. దానితో పాటు ఇతర లక్షణాలు తిమ్మిరి, బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాయామం చేసేటప్పుడు, ముఖ్యంగా వేడి రోజులలో ఎక్కువగా ఆవలింతలు వస్తే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఆవలింత గుండెపోటు లేదా స్ట్రోక్‌తో మాత్రమే సంబంధం కలిగి ఉండదు. అనేక ఇతర ఆరోగ్య పరిస్థితులకు కూడా కారణమవుతాయి.

బ్రెయిన్ ట్యూమర్

మూర్ఛ

మల్టిపుల్ స్క్లేరోసిస్

కాలేయ వైఫల్యానికి

శరీరం దాని ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోతుంది. ఇంతకు ముందుకంటే ఆవలింతలు అధికంగా రావడం మీరు గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మీరు ఎంత త్వరగా వైద్య సహాయం కోరితే అది మీ ఆరోగ్యానికి మంచిది. దీని వెనుక ఉన్న కారణాన్ని డాక్టర్ కనుగొని దానికి అనుగుణంగా మందులను సూచించవచ్చు. నిద్ర లేమి కారణంగా ఆవలింతలు వస్తున్నాయని భావిస్తే.. ఒత్తిడి తగ్గడానికి తగిన మందులు సూచిస్తారు.

Read MoreRead Less
Next Story